Modi’s swearing-in: భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు (June 9) ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలు, NSG commandos, drones and snipers లతో బహుళస్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. రేపు ఆదివారం రాత్రి 7.15 గంటలకు Rashtrapati Bhavan లో మోదీ మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత్తో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సార్క్ (South Asian Organization for Regional Co-operation ) దేశాల నుండి అతిథులు ఆహ్వానించబడ్డారు. అలాగే ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే అతిథులు పూర్తిగా సురక్షితంగా హోటల్కు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు పొరుగు దేశాలైన భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, మారిషస్, సీషెల్స్ దేశాధినేతలు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు.
ఈ అతిథులందరి భద్రత కోసం ఇప్పటికే తాజ్, లీలా, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్ వంటి లగ్జరీ హోటళ్లను భద్రతా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఢిల్లీలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవ భద్రతకు సంబంధించి పారామిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులు ఎన్ఎస్జీ, స్వాట్ కమాండోలతో పాటు రాష్ట్రపతి భవన్తో పాటు ఇతర కీలక ప్రాంతాల చుట్టూ భారీగా మోహరించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA ) పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న తర్వాత June 7న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధ్యక్షుడు ముర్ము అధికారికంగా నరేంద్ర మోదీని కోరారు.