Mobile Customer ID : ఆధార్ తరహాలో సిమ్ కార్డుకూ యునిక్‌ కస్టమర్ ఐడీ.. లాభాలు ఇవే.

యూనిక్ కస్టమర్ ఐడీ: సిమ్ కార్డులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తోంది. ఆధార్ మాదిరిగానే, మొబైల్ సిమ్ వినియోగదారులకు కూడా ప్రత్యేకమైన కస్టమర్ ID నంబర్ కేటాయించబడుతుందని భావిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మొబైల్ కస్టమర్ ID: సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మొబైల్ సిమ్ కార్డుల హ్యాకింగ్ తో మోసాలు జరుగుతున్న తరుణంలో.. ఈ మోసాలకు ప్రత్యామ్నాయంగా కేంద్రం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో సిమ్ కార్డు నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. మరోవైపు మొబైల్ సిమ్ కార్డుల విక్రయదారులపై కేవైసీ నిబంధనలను అమలు చేయాలని, బల్క్ సిమ్ కార్డుల విక్రయాలను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఇందుకోసం ఆధార్ తరహాలో కొత్త కస్టమర్ ఐడీ రూపంలో మొబైల్ ఫోన్ వినియోగదారులకు యూనిక్ ఐడీ నంబర్‌ను జారీ చేయాలని భావిస్తోంది. ఈ నంబర్ సహాయంతో ప్రధాన మొబైల్ సిమ్ కార్డ్‌తో పాటు సప్లిమెంటరీ ఫోన్ కనెక్షన్‌లను గుర్తించడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. సైబర్ మోసాల నుంచి మొబైల్ ఫోన్ వినియోగదారులను రక్షించడమే కాకుండా.. ఈ కస్టమర్ ఐడీ సహాయంతో కస్టమర్ నిర్దిష్ట సంఖ్యలో సిమ్ కార్డులను పొందకుండా నివారించవచ్చని భావిస్తున్నారు.

మరోవైపు మొబైల్ కస్టమర్ ఐడీ సాయంతో అనుమానాస్పద వ్యక్తుల ఫోన్ నంబర్లన్నింటినీ ఒకేసారి బ్లాక్ చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను కేంద్ర టెలికాం శాఖ సిద్ధం చేసిందని ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది.

మరి.. ఈ కస్టమర్ ఐడీ సాయంతో మోసపూరిత మొబైల్ కనెక్షన్లను నివారించవచ్చని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. ఒక వ్యక్తి గరిష్టంగా తొమ్మిది SIM కార్డ్‌లను ఉపయోగించవచ్చు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ సహాయంతో వెరిఫికేషన్ చేస్తేనే మోసాలను అరికట్టవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ ఉన్న 64 లక్షల మొబైల్ ఫోన్ల కనెక్షన్లను కేంద్రం ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *