
ఏపీలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ తరుణంలో ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. ఇటీవల మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ప్రకాశం జిల్లా నరసింహపురంలో తాగునీటి పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి, డోలా బాలవీరాంజనేయస్వామి, పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ, ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ, సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఎన్డీఏ సంకీర్ణం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమలు చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచి, ప్రతి నెలా 1వ తేదీన ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు. దీపం-2 పథకం మొదటి విడత డబ్బులు ఖాతాలో జమ అయ్యాయని ఆయన అన్నారు. తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
[news_related_post]ఈ తరుణంలో, మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో, చాలా ఏళ్ల కల త్వరలో నెరవేరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్లు ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.