AP assembly elections చంద్రబాబు నేతృత్వంలోని TDP కూటమి అపూర్వ విజయం సాధించింది. నాలుగైదు రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నెల 12న నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అయితే కొత్త ప్రభుత్వంలో ఎవరికి మంత్రి పదవులు వస్తాయని ప్రజలు, పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. Janasena నుంచి 21 మంది, భాజపా నుంచి 8 మంది గెలుపొందడంతో రెండు మూడు రోజుల్లో ఎంత మందికి కేబినెట్లో స్థానం కల్పించాలనే దానిపై చర్చలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఈసారి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి అత్యధికంగా కూటమి అభ్యర్థులు గెలుపొందడంతో మంత్రివర్గ కూర్పు కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్లు చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. TDP కూటమిలో మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 25 నుంచి 26 మంది ఎమ్మెల్యేలు కేబినెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందరో సీనియర్లు ఎమ్మెల్యేలుగా రాణించినా సామాజిక సమీకరణ కారణంగా కొంత మంది సీనియర్లకు తొలిసారి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.
గత TDP ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈసారి మంత్రివర్గంలో లేరని సమాచారం. ఆయన సేవలు పార్టీకి, క్యాడర్కు మరిన్ని అందించాలనే భావనతో మంత్రి పదవికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాల సభ్యులుగా ఎవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందో ఓ సారి పరిశీలిస్తే.
గుంటూరు జిల్లా నుంచి అనగాని సత్యప్రసాద్, నక్కా ఆనందబాబు, నాదెండ్ల మనోహర్ (Janasena ), నారాయణ, నెల్లూరు జిల్లా నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తూర్పుగోదావరి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Deputy CM ), బుచ్చయ్య చౌదరి, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, కడప జిల్లా నుంచి ఆర్ మాథవి రెడ్డి. , శ్రీకాకుళం జిల్లా నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు (రామ్మోహన్ నాయుడుకు కేంద్రం రాకుంటే), కూన రవికుమార్, కళా వెంకటరావు, విజయనగరం జిల్లా నుంచి గుమ్మడి సంధ్యారాణి, పశ్చిమగోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణంరాజులు పేర్లు చలామణి లో ఉన్నాయి
అలాగే కృష్ణా జిల్లాకు చెందిన కొల్లు రవీంద్ర, శ్రీరామ్ రాజగోపాల్ (grandfather ), బాల వీరాంజనేయస్వామి, ప్రకాశం జిల్లా గొట్టిపాటి రవికుమార్, చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, థామస్, కర్నూలు జిల్లా నుంచి బీసీ జనార్థన్ రెడ్డి, ఫరూక్, అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, సత్యకుమార్ (BJP ) ) , విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనిత, కొణతాల రామకృష్ణ (Janasena ) పేర్లు వినిపిస్తున్నాయి.
నిజానికి ఒక్కో జిల్లా నుంచి ఐదారుగురు సీనియర్ నేతలు మంత్రి పదవుల రేసులో ఉన్నారు. కొందరు సీనియర్లు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. తమ నాయకుడికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని వారి అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరికి స్థానం దక్కుతుందో తెలియాలంటే ప్రమాణ స్వీకారం రోజు వరకు ఆగాల్సిందే.