మధ్యతరగతి ప్రజల కోసం బడ్జెట్ స్కూటీగా జెన్ 3 ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో అతి తక్కువ ధరకు అత్యుత్తమ ఫీచర్లతో లాంచ్ అయిన ఈ స్కూటీ ధర.. ఫీచర్లు మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
ఈ స్కూటీ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 242 కి.మీ వరకు ప్రయాణించగలదు. దీని ధర రూ. 1.05 లక్షలు. తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక అని ఆటోమోటివ్ నిపుణులు అంటున్నారు. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ 4 కి.వా.హెచ్ బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడింది. దీనికి ముందు జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 కి.వా.హెచ్ బ్యాటరీ ప్యాక్ మాత్రమే ఉండేది. అలాగే, ఈ జెన్ 3 ఎస్1 ఎక్స్ ప్లస్ పోర్టబుల్ 750 వాట్ ఛార్జర్‌తో వస్తుంది. దీని బ్యాటరీ పరిమాణం కూడా పెద్దది. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 242 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
వేగం కూడా ఎక్కువగానే ఉంది. Gen 3 Ola S1 X Plus ఎలక్ట్రిక్ స్కూటీ మరో ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది మిడ్-డ్రైవ్ మోటారుతో 11 కిలోవాట్ల గరిష్ట విద్యుత్ ఉత్పత్తిని అందిస్తుంది. మీరు ఉత్తమ లక్షణాలతో తక్కువ బడ్జెట్‌లో స్కూటీని కొనుగోలు చేయాలనుకుంటే, ఈ Gen 3 Ola S1 X Plus స్కూటీ ఉత్తమ ఎంపిక.