ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటి అనడంలో సందేహం లేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్నందున WhatsApp కు అంత క్రేజ్ ఏర్పడింది. భద్రతకు పెద్దపీట వేస్తూ ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్ మరెన్నో ఫీచర్లను ప్రవేశపెడుతోంది.
కేవలం మెసేజింగ్ సేవలకే పరిమితం కాకుండా టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా మెట్రో తీసుకొచ్చింది. ఇందులో భాగంగా WhatsApp ఏఐ బోట్ ఆధారిత మెట్రో టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఈ సేవలు ఇప్పటికే Hyderabad, Delhi, Chennai and Pune నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి మరియు ఇటీవల ఈ సేవలను Nagpur కు కూడా విస్తరించారు. వాట్సాప్‌లో మెట్రో టికెట్‌ను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
WhatsApp metro ticket services తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు మరాఠీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ ప్రజలు మెట్రో టిక్కెట్‌ను బుక్ చేయాలనుకుంటే, వారు 8341146468కి ‘హాయ్’ అని మెసేజ్ చేయాలి. అదే నాగ్‌పూర్ ప్రయాణికుల కోసం 8624888568కి సందేశం పంపాలి. లేదా వాట్సాప్‌లో QR కోడ్‌ను స్కాన్ చేయండి. వాట్సాప్‌లో త్వరిత కొనుగోలు ఎంపిక కూడా అందించబడింది.
మెట్రోలో రెగ్యులర్ గా ప్రయాణించే వారి కోసం ఈ ఫీచర్ తీసుకొచ్చారు. ఈ ఫీచర్ సహాయంతో మీరు టికెట్ బుకింగ్‌ను సులభతరం చేయడానికి మీరు క్రమం తప్పకుండా ఉపయోగించే మార్గాలను సేవ్ చేయవచ్చు. దీంతో త్వరగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ప్రతిసారీ గమ్యస్థానాలు మరియు ప్రారంభ పాయింట్లను ఎంచుకోవలసిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారా ఒకేసారి ఆరు సింగిల్ జర్నీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే, ఒక్కో లావాదేవీకి గరిష్టంగా 40 మంది ప్రయాణికుల కోసం గ్రూప్ టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. UPI, debit cards or credit cards లతో సులభంగా చెల్లింపులు చేయవచ్చు.