మారుతి సుజుకి తన మొట్టమొదటి ప్యూర్-ఎలక్ట్రిక్ మోడల్ ఇ విటారాను ఈ సంవత్సరం చివర్లో విడుదల చేయనుంది. ఈ కారు టాటా కర్వ్, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా బిఇ 6 వంటి ఫీచర్-ప్యాక్డ్ ఆఫర్‌లకు ఇది తగిన పోటీగా రూపొందుతోంది. తాజా నివేదికల ప్రకారం.. మారుతి ఇ విటారాలో డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఇడి హెడ్‌లైట్లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, మెరుగైన ఏరోడైనమిక్ పనితీరు కోసం యాక్టివ్ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇన్-కార్ కనెక్టివిటీ టెక్‌తో కూడిన హర్మాన్ సౌండ్ సిస్టమ్ వంటి లక్షణాలను అందిస్తుంది. ఇ విటారాలో 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటుతో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్, స్లైడింగ్ రియర్ సీట్లు మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉన్నాయి.
ఇ విటారాలో అనేక భద్రతా లక్షణాలు కూడా ఉండనున్నాయి. వీటిలో 7 ఎయిర్‌బ్యాగులు, TPMS, 360-డిగ్రీ కెమెరా, వెనుక డిస్క్ బ్రేక్‌లు, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, బ్లైండ్ స్పాట్ మానిటర్, పాదచారుల కోసం అకౌస్టిక్ వెహికల్ అలారం సిస్టమ్, లెవల్ 2 ADAS ఉన్నాయి.
Related News
భారతదేశంలో మారుతి e Vitara 10 రంగులలో అందుబాటులో ఉంటుంది. వీటిలో ఆరు సింగిల్-టోన్ ఎంపికలు ఉన్నాయి. అవి నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, బ్లూయిష్ బ్లాక్, ఒపులెంట్ రెడ్, నాలుగు డ్యూయల్-టోన్ షేడ్స్, ఆర్కిటిక్ వైట్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్, స్ప్లెండిడ్ సిల్వర్, ఒపులెంట్ రెడ్, ఒక్కొక్కటి నల్లటి పైకప్పుతో రానున్నది.