న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం తగ్గింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు సమీపిస్తున్న తరుణంలో ఇన్వెస్టర్లు అనేక నష్టాల భయంతో అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం వరుసగా ఐదో రోజు సూచీలు పతనమయ్యాయి.
BSE సెన్సెక్స్ 617 పాయింట్లు నష్టపోయి 73,886 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 216.30 పాయింట్లు నష్టపోయి 22,489 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, టైటాన్, టెక్ మహీంద్రా, విప్రో, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.
మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఎస్ బీఐ, ఎల్ అండ్ టీ షేర్లు భారీగా లాభపడ్డాయి.