పాఠశాల విద్యార్థులని వారు చేరబోవు స్కూల్ కి మ్యాప్ చేసే విధానం .. CSE ప్రొసీడింగ్స్ ..

EMS స్టూడెంట్ ఇన్ఫో వెబ్‌సైట్‌లో విద్యార్థులను ఇతర పాఠశాలకు బదిలీ చేయడం మరియు మ్యాపింగ్ చేయడం ఎలా విద్యార్థులు వేరే పాఠశాలకు ప్రమోట్ చేయుట ప్రాసెస్ ..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

How to Transfer and Mapping Students to other school Students Transfer and Mapping to other school:

విద్యార్థుల బదిలీ మరియు మ్యాపింగ్- యూజర్ మ్యాన్యువల్

ముందుగా ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్ తన‌ పాఠశాలలో గరిష్ఠ తరగతిలోని విద్యార్థులు అందరి తల్లి/ తండ్రి/సంరక్షకుని కలిసి తమ బిడ్డ తదుపరి తరగతికి ఏ పాఠశాల లో చేరబోవుచున్నారో ఆ వివరాల సమ్మతి పత్రం సంతకంతో‌సహా తీసుకోవాలి.
తదుపరి child info వెబ్‌సైట్ లో లాగిన్ అయి,Services లింక్ నొక్కి,అందులో “Students Transfer and Mapping to other school” అనే లింక్లోకి వెళ్ళాలి.

ఇక్కడ మన పాఠశాల లో‌ గరిష్ఠ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను వారు తదుపరి తరగతికి చేరబోవు పాఠశాల వివరాలు మ్యాపింగ్ చేయుటకుగాను ఆ తరగతి లోని అందరి విద్యార్థులు పట్టిక డిస్ ప్లే చేయబడుతుంది.

ఉదాహరణకు ప్రాధమిక పాఠశాల గరిష్ఠ తరగతి “5 “ అనుకుంటే….ఆ తరగతిలో అందరి వివరాలు చూపబడుతాయి.
దీనికై ప్రతి విద్యార్థి పేరు ముందర ఒక చెక్ బాక్స్ ఉంటుంది.

ఆ బాక్స్ పై క్లిక్ చేయడం ద్వారా ఆ విద్యార్థిని మ్యాప్ చేయుటకు ఎంచుకున్నామని అర్థం.

పైన చెప్పిన విధంగా విద్యార్థులను ఎంచుకొన్న తరువాత Transfer అనే బటన్ పై క్లిక్ చేయవలెను.

Transfer బటన్ పై క్లిక్ చేసిన తరువాత పైన చూపిన విధంగా ఎంచుకున్న విద్యార్థులు చేరబోయే పాఠశాల వివరాల కోసం సెలక్షన్ బటన్ లు వస్తాయి.

  • 1.Within Mandal:- ఈ బాక్స్ పై క్లిక్ చేస్తే….మీ మండలంలోని పాఠశాలల లిస్ట్ సెలక్షన్ కి వస్తుంది. ఎంచుకున్న పాఠశాల పై క్లిక్ చేసి “submit” బటన్ పై నొక్కండి. వెంటనే మీరు ఎంచుకున్న విద్యార్థులు, వారు ఎంచుకున్న పాఠశాల కి మ్యాప్ చేయబడతారు.
  • 2. Within District: – ఈ బాక్స్ పై క్లిక్ చేస్తే….మీ జిల్లాలోని మండలాలు,పాఠశాలలు సెలక్షన్ కి వస్తాయి. మండల సెలక్షన్ లో మండలాన్ని ఎంచుకొనవలెను. అప్పుడు ఎంచుకొన్న మండలంలో పాఠశాలల లిస్ట్ వస్తుంది. మీరు ఎంచుకున్న పాఠశాల పై క్లిక్ చేసి submit బటన్ పై నొక్కండి. వెంటనే మీరు ఎంచుకున్న విద్యార్థులు, వారు ఎంచుకున్న పాఠశాల కి మ్యాప్ చేయబడతారు.
  • 3. Within state:- ఈ బాక్స్ పై క్లిక్ చేస్తే…మన రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు,పాఠశాలలు సెలక్షన్ కి వస్తాయి. జిల్లా సెలక్షన్ చేయండి. తదుపరి మండల సెలక్షనలో మండలాన్ని ఎంచుకొనవలెను. అప్పుడు ఎంచుకొన్న మండలంలో పాఠశాలల లిస్ట్ వస్తుంది. మీరు ఎంచుకున్న పాఠశాల పై క్లిక్ చేసి submit బటన్ పై నొక్కండి. వెంటనే మీరు ఎంచుకున్న విద్యార్థులు, వారు ఎంచుకున్న పాఠశాల కి మ్యాప్ చేయబడతారు.
  • 4. Outside state:- ఈ బాక్స్ పై క్లిక్ చేస్తే రాష్ట్రాల లిస్ట్ సెలక్షన్ కి వస్తుంది. వాటిలో విద్యార్థి చేరబోయే రాష్ట్రం సెలక్షన్ చేసుకొని submit బటన్ పై నొక్కండి.

ఈ విధంగా ఒక్కొక్కరినీ తల్లిదండ్రులు ఆసక్తి చూపిన పాఠశాలకి మీ మండలంలో లేదా మీ జిల్లాలో లేదా మన రాష్ట్రంలో చేరబోవు పాఠశాల ని మ్యాప్ చేయవలెను.

రాష్ట్రం బయట చేరదలచుకున్న వారివి కేవలం ఆ రాష్ట్రం పేరు submit చేస్తే చాలు.

Accepting Transferred students

Login to HM -> under services ->Transferred and Mapped students acceptance

బదిలీ చేయబడిన విద్యార్థుల వివరాలను సంబంధిత పాఠశాల లాగిన్ కి పంపబడును.

సదరు ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్ తమ‌ లాగిన్ లో సర్వీసెస్ నందు Transferred and Mapped students Acceptance అనే లింక్ పై క్లిక్ చేయడం ద్వార పొందాలి.

పైన చెప్పిన లింక్ పై నొక్కగానే మన పాఠశాల కి పంపబడిన విద్యార్థుల వివరాలు చూపబడును. లిస్ట్ కిందన ఉన్న Accept బటన్ నొక్కి అందరిని తన పాఠశాల లోకి తీసుకోవలెను.

HM/ Principal accept చేయగానే ఇరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు మొబైల్ కి Alert మెసేజ్ పంపబడుతుంది.

MIS REPORTS:

Transfer and Mapping కి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది.

HM:- లాగిన్–> రిపోర్ట్స్—> school wise transfer and mapping details.

MEO/DEO: పై విధంగానే చేయాలి

CSE PROCEEDINGS COPY

Parent Declaration form Download here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *