వేసవిలో పుచ్చకాయ, ద్రాక్ష, కర్భుజ వంటి అనేక రకాల పండ్లు లభిస్తాయి. అంతేకాదు పండ్లకి రాజు మామిడి పండు కూడా ఈ సీజన్ లోనే దొరుకుంతుంది. దీని కారణంగా ప్రజలు వేసవి కాలం కోసం వేచి ఉంటారు. తీపి, రసము, సువాసనగల మామిడిపండ్లను చూసిన వెంటనే తినాలని అనిపిస్తుంది. మామిడిలో విటమిన్ ఎ, బి6, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి, చర్మానికి చాలా మేలు చేస్తాయి. అన్ని వయసుల వారు మామిడి పండ్లు తినడానికి ఇష్టపడతారు. అయితే మీకు మామిడి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసా..! లేకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
మామిడి పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉన్నప్పటికీ స్వభావం వేడిగా ఉంటుంది. కావున మామిడి పండుని కడిగిన వెంటనే తింటే.. కోసుకుని తింటే మలబద్ధకం, అజీర్ణం వంటి కడుపు సమస్యలు వస్తాయి. కాగా, మామిడి పండుని తినడానికి ముందు దానిని 3-4 గంటలు నీటిలో నానబెట్టాలి. తర్వాత తినాలి.
Related News
మామిడి పండ్లు ఎక్కువగా తినకండి..
మామిడి పండుని పరిమిత పరిమాణంలో తినాలి. లేకుంటే అది ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది. ఒక రోజులో 2 నుంచి 3 మామిడి పండ్ల కంటే ఎక్కువ తినకూడదు. ఎందుకంటే మామిడి పండుని ఎక్కువగా తింటే ఆరోగ్యానికి, చర్మానికి హాని కలిగిస్తుంది. మామిడి పండ్లు ఎక్కువగా తినడం వల్ల ముఖం మీద మొటిమలు వస్తాయి.
జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది.
మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల చర్మంపై మాత్రమే కాదు జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. దీని కారణంగా అతిసారం అంటే విరేచనాలు వంటి కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు.
ఖాళీ కడుపుతో మామిడిపండు తింటే
మామిడిపండును ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. ఎందుకంటే మామిడిలో అధిక మొత్తంలో ఫైబర్, చక్కెర ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తాయి. అసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్ వంటి సమస్యలు రావచ్చు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం
మామిడి పండులో చాలా సహజ చక్కెర ఉంటుంది. దీని కారణంగా మామిడి పండుని ఎక్కువ మొత్తంలో తింటే రక్తంలో చక్కెర స్థాయిని పెరుగుతుంది. కనుక మధుమేహ రోగులు మామిడి పండుకి దూరంగా ఉండాలి. ఎందుకంటే దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది.