Mandi Biryani: మహిళ ప్రాణం తీసిన ‘కుజీ మండీ’ బిర్యానీ.. 178 మందికి తీవ్ర అస్వస్థత

కుజి మండి బిర్యానీ: కలుషిత ఆహారంతో మరో ప్రాణం కోల్పోయింది. గత నెలలో పాన్ తిని చిన్నారి మృతి చెందిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటుచేసుకుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

బిర్యానీ తిని ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందింది. అంతేకాకుండా ఆ బిర్యానీ తిన్న 178 మంది కూడా తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ దారుణ ఘటన కేరళ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన రాజకీయంగా కూడా వివాదాస్పదమైంది.

త్రిసూర్ జిల్లా పెరింజనం పట్టణంలోని ఓ రెస్టారెంట్‌కు కుటిలకడవ్‌కు చెందిన నుసైబా (56) అనే మహిళ వచ్చింది. అక్కడ స్పెషల్ కుజీ మండీ బిర్యానీ తిన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం సమీపంలోని పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో సుసైబాను వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అయితే అదే హోటల్‌లో భోజనం చేసిన 178 మంది కూడా అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అయితే ఈ ఘటన కేరళలో పెను సంచలనం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటన పెను వివాదానికి దారి తీసింది. ఈ ఘటనతో మేల్కొన్న కేరళ ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. ఆరోగ్య శాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, పంచాయతీ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్‌లో కలుషిత ఆహారాన్ని వండినట్లు గుర్తించారు. శాంపిల్‌లో రెస్టారెంట్‌లోని మయోనైస్ కలుషితమైందని తేలింది.