మీ రిటైర్మెంట్ కోసం భద్రతను అందించే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కావాలా? మీ డబ్బును చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టి భారీ మొత్తంగా పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే, SIP (Systematic Investment Plan) లో 15x15x15 ఫార్ములా మీ కోసం
15x15x15 SIP ఫార్ములా అంటే ఏమిటి?
ఈ ఫార్ములా ద్వారా 15 ఏళ్లలో ₹1 కోటి సంపాదించే అవకాశం ఉంది. దీని ప్రకారం:
- మొదటి 15: ప్రతి నెల ₹15,000 SIPలో ఇన్వెస్ట్ చేయాలి
- రెండవ 15: వార్షికంగా సగటు 15% రిటర్న్ లభిస్తుందని అంచనా
- మూడవ 15: కనీసం 15 సంవత్సరాలు ఈ ఇన్వెస్ట్‌మెంట్ కొనసాగించాలి
ఈ ఫార్ములా లాంగ్ టర్మ్‌లో సంపద సృష్టించేందుకు ఒక అద్భుతమైన మార్గం.
15 ఏళ్లలో ఎంత డబ్బు మీ ఖాతాలోకి వస్తుంది?
- నెలకు ఇన్వెస్ట్ చేసే మొత్తం: ₹15,000
- 15 ఏళ్లలో మొత్తం ఇన్వెస్ట్ చేసిన మొత్తం: ₹27,00,000
- అంచనా లాభం (Capital Gain): ₹74,52,946
- 15 ఏళ్ల తర్వాత మొత్తం సొమ్ము: ₹1,01,52,946
కేవలం రోజుకు ₹500 పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో ₹1 కోటి మీ ఖాతాలోకి రావచ్చు.
Related News
SIPలో ఇన్వెస్ట్ చేయడంలో ప్రధాన ప్రయోజనాలు
- చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టి పెద్ద మొత్తం సంపాదించే అవకాశం
- మార్కెట్ డౌన్ అయినా మీ పెట్టుబడి గడచిన కాలంతో పెరుగుతుంది
- లాంగ్ టర్మ్‌లో సంపద పెంచుకోవడానికి ఉత్తమ మార్గం
- రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత పొందేందుకు మంచి ప్లాన్
కానీ ఇవి గుర్తుంచుకోవాలి
- SIP ఒక మార్కెట్-లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే, రిటర్న్స్ గ్యారంటీ కాదు
- 15% రిటర్న్ అనేది అంచనా మాత్రమే, మార్కెట్ పరిస్థితులను బట్టి మారవచ్చు
- లాభాలు గ్యారంటీ అయితే కాదు కానీ, లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది
ఆలస్యం చేస్తే మీ లాభం తగ్గిపోతుంది… ఇంకెందుకు ఆగడం? వెంటనే SIP ప్రారంభించి భవిష్యత్తును భద్రపరచుకోండి…