సంక్రాంతి వచ్చిదంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో సందడి, సరదా నెలకొంటుంది. అందుకే సంక్రాంతిని సరదాల సంక్రాంతి అని కూడా పిలుస్తుంటారు. వాకిట్లో రంగు రంగుల ముగ్గులు, హరిదాసుల సందడులు, వంటింట్లో గుమగుమలాడే పిండి వంటలు, బంధువుల కేరింతలు. ఇవన్నీ కలిపితే సంక్రాంతి మనకు కనుల పండువగా కనిపిస్తుంటుంది. ఈ సంక్రాంతికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటారు. పెద్దలు కూడా చిన్న పిల్లల మాదిరిగా అయిపోయి పంతగులను ఎగరేస్తారు. అసలు సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగరేస్తారు? దాని వెనుక న్నా అసలు కథ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. దేవుళ్ల ఆహ్వానం కోసం సంక్రాంతికి పంతంగులు ఎగరేయడానికి అనేక కారణాలు ఉన్నాయి.
సాధారణంగా సంక్రాంతి చలికాలంలో వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు. అందుకే సూర్యుడిని అంకితం చేస్తూ గాలిపటాన్ని ఎగరేస్తారు. అలాగే చలికాలం పూర్తయి వసంతంలోకి అడుగుపెడుతున్నామని చెప్పడానికి ఈ పంతంగులను ఎగరేస్తారని పెద్దలు చెబుతుంటారు. అలాగే దేవతలు ఆరు నెలల తరువాత సంక్రాంతికి నిద్ర నుంచి మేల్కొంటారట. వారిని స్వాగతం పలికేందుకు ఆకాశంలో పంతంగులను ఎగరేస్తారని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే పురాణాల ప్రకారం శ్రీరాముడు.. హనుమంతుడితో పాటు తన తమ్ముళ్లు లక్ష్మణుడు, ఇతరులతో కలిసి సంక్రాంతి రోజున గాలిపటం ఎగరేశారని, అప్పటి నుంచి సంక్రాంతికి గాలిపటం ఎగరేసే సంప్రదాయం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఆరోగ్యం కోసం కూడా “ఏం తిని చచ్చారురా మళ్లీ: చైనాలో మళ్లీ హెల్త్ ఎమర్జెన్సీ!..భారీగా మరణాలు” గాలిపటం ఎగరేయడం కేవలం వినోదం కోసం మాత్రమే కాదు.. గాలిపటం ఎగరేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఈ గాలిపటాన్ని ఎగరేయడం వల్ల సూర్యుని నుంచి వచ్చే సూర్యకిరణాలు మన శరీరంపై నేరుగా పడతాయి. దీనివల్ల శరీరానికి ఎంతగానో అవసరమైన విటమిన్ డీ పుష్కలంగా లభిస్తుంది. ఫలితంగా విటమిన్ డీ కొరకు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ఎండలో ఉండడం వల్ల ఆహ్లాదకరమైన ప్రశాంతత దొరుకుతుంది. అలాగే గుండెకు కూడా చాలా మంచిది