అదా.. ఇదా.. మహిళలూ, అమ్మాయిలకోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ రెండు స్కీమ్స్ లో ఏది బెస్ట్…

మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని అద్భుతమైన పొదుపు పథకాలు అందిస్తోంది. ముఖ్యంగా పోస్టాఫీస్ ద్వారా నడిపించే సుకన్య సమృద్ధి యోజన (SSY), మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఈ రెండు స్కీంలు మిగతా అన్నీ‌ స్కీమ్స్ కంటే ముందు ఉన్నాయి. మంచి వడ్డీ రేట్లతో మహిళలకు భద్రతనిచ్చే ఈ రెండు స్కీమ్స్‌లో ఏది మీకు బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

1. సుకన్య సమృద్ధి యోజన (SSY):

ఈ స్కీమ్‌ను జనవరి 2015లో ప్రారంభించారు. ఇది ఒక చిన్నారి అమ్మాయి పేరుతో మాత్రమే ఓపెన్ చేయగలరు. వయసు: 10 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలకు మాత్రమే.డిపాజిట్ పరిమితి: కనీసం ₹250 నుంచి గరిష్ఠంగా ₹1.5 లక్షలు సంవత్సరానికి.వడ్డీ రేటు: ప్రస్తుతం 8.2% వార్షిక వడ్డీ.లాక్ ఇన్ పీరియడ్: 15 ఏళ్ల వరకూ డిపాజిట్ చేయాలి, అమ్మాయి 21 ఏళ్లు వచ్చినప్పుడు మెచ్యూరిటీ. పన్ను మినహాయింపు: సెక్షన్ 80C కింద ₹1.5 లక్షల వరకూ మినహాయింపు లభిస్తుంది.

2. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్:

ఈ స్కీమ్‌ను ఏప్రిల్ 2023లో ప్రారంభించారు. ఇది ఏ మహిళైనా లేదా చిన్నారి అమ్మాయి పేరుతో కూడా ఓపెన్ చేయవచ్చు. డిపాజిట్ పరిమితి: కనీసం ₹1,000 నుంచి గరిష్ఠంగా ₹2 లక్షలు మాత్రమే.వడ్డీ రేటు: 7.5% వార్షిక వడ్డీ.లాక్ ఇన్ పీరియడ్: 2 ఏళ్లు. 1 సంవత్సరం తర్వాత 40% డబ్బు విత్‌ డ్రా చేయొచ్చు.స్కీమ్ పరిమితి: మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.లభ్యత: దేశవ్యాప్తంగా ఉన్న 1.59 లక్షల పోస్టాఫీసుల్లో ఈ స్కీమ్ లభ్యం.

Related News

ముగింపు: ఈ రెండు స్కీమ్స్‌ కూడా మహిళలు, అమ్మాయిల భవిష్యత్తును సురక్షితం చేస్తాయి.

SSY అనేది దీర్ఘకాల పెట్టుబడి – అమ్మాయి పెరిగే వరకు. మహిళా సర్టిఫికేట్ అనేది తక్కువ కాలపు పొదుపు – 2 ఏళ్లలోనే లాభాలు. మీ అవసరాలకు తగ్గట్టు ఏది బెటరో ఈరోజే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడే ప్రారంభించండి.