Mahalakshmi Scheme: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది.
అందులో కొన్ని ఇప్పటికే అమలులో ఉన్నాయి. మరికొన్నింటిని త్వరలో అమలు చేయనున్నారు. ముఖ్యంగా మహిళలకు కాంగ్రెస్ ఎన్నికల్లో వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ప్రతినెలా రూ.2500 చెల్లిస్తానని చెప్పింది. మహిళలకు రూ. 2,500 పథకంపై సీతక్క, పొన్నం ప్రభాకర్‌లు అప్‌డేట్ ఇచ్చారు.
అర్హులైన ప్రతి మహిళకు రూ. 2500 చొప్పున అందజేస్తామని ప్రకటించగా.. త్వరలోనే ఈ పథకం అమలులోకి వస్తుందన్నారు. అంతేకాదు పలు అంశాలకు సంబంధించిన ముఖ్యమైన అప్ డేట్స్ కూడా ఇచ్చారు. మహిళలకు రూ. 2500 పథకానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. త్వరలో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ హామీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో White Ration Card ఉన్న ప్రతి మహిళ ఖాతాలో ప్రతి నెలా రూ. 2500 జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక చేయూతనిస్తోందన్నారు. పథకంలోని కీలక అంశాన్ని కూడా వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పింఛను పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే రూ. 2500 పొందేలా నిబంధనలు తీసుకువస్తున్నామన్నారు. అంతేకాదు July నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Congress government తీసుకొచ్చిన ఉచిత బస్సుయాత్ర మంచి విజయమని చెప్పొచ్చు. కానీ రూ. 500 గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం కొంత మందికి మాత్రమే వర్తిస్తుందని ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పటికీ చాలా మందికి Ration Card లేవు. New Ration Card ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది.