Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో.. అఘోరాల నృత్యాలు చూశారా..!

రక్తంతో నిండిన తల.. మెడపై పుర్రెలు.. అర్ధనగ్న శరీరం.. ఒక చేతిలో డోలు.. మరో చేతిలో త్రిశూలం.. హర హర మహాదేవ.. శంభో శంకర.. అంటూ నినాదాలు.. వాటికి తగ్గట్టుగా నృత్యాలు.. శివుడే దిగివచ్చినట్లు అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఇది ప్రయాగ్‌రాజ్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుత భక్తి పారవశ్యం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో మహా కుంభమేళా జరగనుంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 40 కోట్ల మంది హాజరవుతారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చే భక్తుల కోసం విమాన సర్వీసులతో పాటు 13,000 రైళ్లను నడుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌లో కల్పిస్తున్న సౌకర్యాలను ముఖ్యమంత్రి యోగి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా కేంద్ర బలగాలు కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అన్ని శాఖల అధికారులకు ఇక్కడ విధులు కేటాయించింది.

అఘోరాలు వస్తున్నారు

జనవరి 13 నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుండగా.. ఇప్పటికే అక్కడ సందడి నెలకొంది. ఈ సమయంలో అక్కడకు అఘోరాలు పెద్దఎత్తున వస్తున్నారు. శివుడిని పోలిన వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు.. కాళ్లు చాచి.. శివ నామస్మరణ చేస్తూ.. కళ్లు చెమ్మగిల్లేలా నృత్యాలు చేస్తున్నారు. అఘోరాలు ఇప్పటికే హిమాలయ పర్వతాల నుండి ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరారు. కొంత మంది వారి పురోగతిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. “కుంభమేళా ఇంకా ప్రారంభం కాలేదు. కానీ సందడి మొదలైంది.. అఘోరాలు విపరీతంగా వస్తున్నారు. భక్తి పారవశ్యాన్ని పెంచుతున్నారు. శివనామస్మరణ ఆకట్టుకుంటుంది. ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. శివునికి నమస్కరిస్తూ.. ఆలపిస్తున్న శివుని పాటలు అలరిస్తాయి ఇంత చలిలోనూ అర్ధనగ్నంగా రావడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని అఘోరాలు రకరకాలుగా తపస్సు చేసుకుంటున్నారు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు కొందరు తమ శరీరమంతా విభూదితో నృత్యాలు చేస్తూ.. తెల్లవారుజామున శివుడిని స్మరిస్తూ.. అఘోరాలు రావడంతో మంత్రాలు పఠిస్తున్నారు ప్రయాగ్‌రాజ్ ప్రాంతం ఆధ్యాత్మిక సౌందర్యాన్ని సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *