ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భక్తుల గుడారాలలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన భక్త జనాలు శిబిరాల నుండి బయటకు పరుగులు లంకించుకున్నారు.
అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికిప్రయత్నించారు..
ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలోని సెక్టార్ 5లో మంటలు చెలరేగాయి. 20 నుండి 25 గుడారాలు కాలి బూడిదయ్యాయని భావిస్తున్నారు. మంటలను అదుపు చేయడానికి ఆరు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, మంటలు అన్ని దిశలకు వ్యాపిస్తుండటంతో, పోలీసులు మరియు NDRF బృందాలు చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు. . మహాకుంభమేళా ప్రాంతంలోకి వచ్చే వంతెన మరియు రైల్వే వంతెన మధ్య ప్రాంతంలో మంటలు చెలరేగాయని అనధికారిక సమాచారం
అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అంటే
భక్తులు బస చేయడానికి జాతర ప్రాంతంలో టెంట్లు ఏర్పాటు చేశారు. టెంట్లలో వసతి మరియు ఆహారం కోసం పూర్తి ఏర్పాట్లు ఉన్నాయి. ఒక టెంట్‌లో ఉంచిన సిలిండర్ పేలిన తర్వాత మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. టెంట్లు వరుసగా ఏర్పాటు చేయడంతో ప్రమాదం తర్వాత మంటలు ఒకదాని తర్వాత ఒకటి వ్యాపించాయి.
#WATCH | Prayagraj, Uttar Pradesh | A fire breaks out at the #MahaKumbhMela2025. More details awaited. pic.twitter.com/pmjsAq9jkA
— ANI (@ANI) January 19, 2025