mAadhaar: అసలేంటీ ఎం ఆధార్‌ అంటే ? ఈ యాప్‌తో ఉపయోగాలు ఏంటి.? ఎలా డౌన్లోడ్ చేయాలి ?

వినియోగదారులు నేరుగా ఆధార్‌ను యాక్సెస్ చేసేందుకు వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో ఎం ఆధార్ అనే మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ వల్ల ఉపయోగం ఏమిటి? ఇందులో ఆధార్ కార్డును ఎలా నమోదు చేయాలి.? ఇలాంటి పూర్తి వివరాలు మీకోసం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రస్తుతం ఆధార్ కార్డు వినియోగం అనివార్యంగా మారింది. సిమ్ కార్డు నుంచి సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే వరకు అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఆధార్ అవసరం పెరుగుతున్న కొద్దీ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

ముఖ్యంగా వినియోగదారులు నేరుగా ఆధార్‌ను యాక్సెస్ చేసుకునేందుకు వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌ని కూడా అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో ఎం ఆధార్ అనే మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ వల్ల ఉపయోగం ఏమిటి? ఇందులో ఆధార్ కార్డును ఎలా నమోదు చేయాలి.? ఇలాంటి పూర్తి వివరాలు మీకోసం..

mAdhaar లో నమోదు చేసుకోవడం ఇలా..

* ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి mAadhaar యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌ను తెరిచిన తర్వాత, ‘Register Adhaar’పై క్లిక్ చేయండి.

ఆ తర్వాత Profile ను access చేయడానికి మీరు నాలుగు అంకెల పిన్ లేదా పాస్‌వర్డ్‌ను రూపొందించాలి.

* దీని కోసం ముందుగా Adhaar Number వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత Captcha code ను నమోదు చేస్తే… రిజిస్టర్డ్ నంబర్‌కు OTP వస్తుంది.

* మొబైల్ ఫోన్‌లో OTP రాగానే Auto fill అవుతుంది. Registration పూర్తయిన వెంటనే, సంబంధిత వినియోగదారు వివరాలు screen పై ప్రదర్శించబడతాయి.

* Menu లో దిగువన కనిపించే My Adhaar’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, PIN లేదా Password ను నమోదు చేయండి. డాష్‌బోర్డ్ తెరవబడుతుంది. ఇందులో మీకు అవసరమైన సేవలను ఉపయోగించుకోవచ్చు.

mAdhaar App ఉపయోగాలు..

* మీరు మీ ఆధార్ కార్డ్ వివరాలను Offline మోడ్‌లో చూడవచ్చు. ఒకే ఫోన్‌లో ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను భద్రపరుచుకోవచ్చు.

* ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

* Virtual ID ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు నేరుగా ఫోన్‌లో మీ ఆధార్ కార్డ్‌ని lock మరియు Unlock చేయవచ్చు. బయోమెట్రిక్ లాక్ చేయవచ్చు. వీటితో పాటు బ్యాంక్, ఆధార్ లింక్ వంటి అనేక ఇతర ఫీచర్లను పొందవచ్చు