ఏపీలో వేర్వేరు వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వేడిగాలులు వీస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు రైతులను ముంచెత్తాయి. తాము కష్టపడి పండించిన పంటలకు ముందే వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో పాటు బలమైన గాలుల కారణంగా తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి.
ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా మంగళవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తీరానికి సమాంతరంగా కదులుతూ బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునని, అల్పపీడన ప్రాంతం ఏర్పడిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఇంతలో, ఏపీలో కొన్ని చోట్ల రాబోయే నాలుగు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అల్లూరి, సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కార్మికులు పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్లు, స్తంభాలు, టవర్ల కింద కాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
Related News
ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయి
ఇదే జరిగితే ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం రాయలసీమలో 40 నుండి 42 డిగ్రీల వరకు, ఉత్తర ఆంధ్రలో 39 నుండి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా కామవరంలో 40.8°C, ప్రకాశంలోని పెద్దదోర్నాలలో 40.7°C, నంద్యాలలోని దొర్నిపాడులో 40.6°C, పల్నాడులోని రావిపాడులో 40.5°C, శ్రీకాకుళంలోని పాడూరులో 40.3°C.40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.