Lifestyle: ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే

రోజుకో యాపిల్.. మీ ఆరోగ్యానికి శ్రీరాముడి రక్షణనిస్తుంది.. ఇక డాక్టర్లతో మాట్లాడాల్సిన పనిలేదు అంటున్నారు చాలామంది. అయితే రోజుకో యాపిల్ తినడం కుదరదు కాబట్టి.. రోజుకో అరటిపండు తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. అదేంటో చూద్దాం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

అరటిపండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడే పండు. నెల రోజుల పాటు రోజూ క్రమం తప్పకుండా అరటిపండు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

అరటిపండ్లలోని విటమిన్ బి6 రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అరటిపండ్లు మన శరీరానికి శీఘ్ర శక్తిని ఇస్తాయి. అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని తాజా అధ్యయనంలో తేలింది.

Related News

అరటిపండ్లు, యాపిల్స్ తినేవారిలో ఏ కారణంతోనైనా మరణించే ప్రమాదం దాదాపు 40 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఈ పండ్లను వారానికి 3 నుంచి 6 సార్లు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అరటిపండులో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది మరియు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

యాపిల్స్‌లో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వాటిలో విటమిన్ సి, పొటాషియం మరియు విటమిన్ కె అధికంగా ఉంటాయి. యాపిల్స్‌లో డైటరీ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.

గమనిక: పై సమాచారం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడం మంచిది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *