Layoffs | ఐటీ ఉద్యోగుల మెడపై ఏఐ కత్తి.. సైలెంట్‌గా కొనసాగుతున్న లేఆఫ్‌లు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో నైపుణ్యం లేకపోవడం చాలా మంది ఉద్యోగుల తొలగింపులకు దారితీసింది. జావా, .NET, C, C++..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

JAVA, .NET, C, C++.. ఇలా ఎన్ని ప్రోగ్రామింగ్ భాషల్లో అనుభవం ఉన్నా, AI లో నైపుణ్యం లేకపోతే ఉద్యోగావకాశం ఉండదు. AI నైపుణ్యాలు లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఐటీ కంపెనీలు వేలాది మందిని తొలగిస్తున్నాయి. ‘ప్రాజెక్టులు లేవు.. పనితీరు సరిగా లేదు’ అంటూ సైలెంట్‌గా లేఆఫ్‌లు జరుగుతున్నాయి. 3 నెలల్లో 10,000 మంది ఉపాధి కోల్పోయారని, ఒక్క హైదరాబాద్‌లోనే 4,500 మంది ఉపాధి కోల్పోయారని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

AI నైపుణ్యాలతో ఉద్యోగ భద్రత

Related News

ఐటీ రంగంలో ఏఐ వినియోగం గణనీయంగా పెరిగింది. మానవులు చేయవలసిన అన్ని పనులను AI సాధనాలు చేస్తున్నాయి. దీంతో కంపెనీలు తమ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

AI టూల్స్ తో చేసేస్తున్నారు

నేడు వందల కొద్దీ AI సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్‌ను ఉపయోగించడానికి ఎవరైనా నెలవారీ లేదా వార్షిక రుసుము చెల్లించడం ద్వారా AI సాధనాలను ఉపయోగించవచ్చు. ఏడాదిన్నర క్రితం, AI వినియోగం ChatGPTతో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇమేజ్, కోడ్, వీడియో, స్పీచ్, 3D మరియు పరిశోధన సంబంధిత పనుల కోసం డజన్ల కొద్దీ AI సాధనాలు అందుబాటులో ఉన్నాయి.