ఇన్కమ్ టాక్స్ రిటర్న్ (ITR) ఫైలింగ్ చేసిన తర్వాత, దాన్ని వెరిఫై చేయడం చాలా అవసరం. లేదంటే, మీ రిఫండ్ వచ్చే అవకాశం ఉండదు. మీ బ్యాంక్ ఖాతా ఆదాయపు పన్ను పోర్టల్‌లో వెరిఫై అయి ఉండాలి. ఇలా లేకపోతే, టాక్స్ రిఫండ్ క్రెడిట్ కావదు. మరి మీ బ్యాంక్ ఖాతా ఎలా వెరిఫై చేయించుకోవాలి? దీనికి సమాధానం ఈ స్టెప్స్‌లో ఉంది.
బ్యాంక్ ఖాతా వెరిఫై చేసే విధానం
1. ఆదాయపు పన్ను పోర్టల్‌లో లాగిన్ అవ్వండి
మొదట www.incometax.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ PAN లేదా ఆధార్ నెంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. కొత్త యూజర్ అయితే, ముందుగా యూజర్ఐడి, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే OTP ఎంటర్ చేయాలి.
ఇప్పుడే ‘Profile’ సెక్షన్‌లోకి వెళ్లి, అక్కడ ‘Profile Settings’ క్లిక్ చేయాలి. అందులో ‘My Bank Account’ ఎంపికను సెలెక్ట్ చేసుకోండి.
Related News
2. బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయండి
‘Add Bank Account’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, అవసరమైన వివరాలు నమోదు చేయాలి: బ్యాంక్ పేరు, అకౌంట్ నెంబర్, అకౌంట్ టైప్ (Savings/Current), IFSC కోడ్ మరియు బ్రాంచ్ వివరాలు.
వివరాలు సరిగ్గా ఎంటర్ చేసి, ‘Proceed to Submit’ క్లిక్ చేయండి.
3. బ్యాంక్ ఖాతా వెరిఫై చేయండి
బ్యాంక్ ఖాతా జత చేసిన తర్వాత, దాన్ని వెరిఫై చేయాలి. ఇది రెండు రకాలుగా చేయవచ్చు: నెట్ బ్యాంకింగ్ ద్వారా మరియు EVC (Electronic Verification Code) ద్వారా.
మీ బ్యాంక్ ఖాతా, ఆధార్‌కు లింక్ అయితే, EVC ఆప్షన్ ఎంచుకుని, మీ మొబైల్‌కు వచ్చిన OTP ఎంటర్ చేయండి.
వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, ‘My Bank Accounts’ సెక్షన్‌లోకి వెళ్లి స్టేటస్ చెక్ చేయండి. ‘Validated & EVC Enabled’ అని కనిపిస్తే, మీ ఖాతా విజయవంతంగా వెరిఫై అయినట్టే.
గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు
వెరిఫై అయిన ఖాతాకే టాక్స్ రిఫండ్ వస్తుంది. బ్యాంక్ ఖాతా PAN డీటైల్స్, ఆదాయపు పన్ను పోర్టల్ PANకి మ్యాచ్ అవ్వాలి.మీరు ఎన్నో ఖాతాలు జతచేయవచ్చు, కానీ ఒకటి మాత్రమే రిఫండ్ కోసం ప్రాధాన్యంగా ఎంపిక చేయాలి.
మీ ITR రిఫండ్ సమస్య లేకుండా రావాలంటే, ఈ చిన్న వర్క్ చేయండి. ఆలస్యం చేసితే, మీ డబ్బులు లేటవుతాయి.