రతన్ టాటా 3,800 కోట్ల ఆస్తి ఎవరికోసం?.. కుటుంబం, ఫ్రెండ్స్‌కు ఏం దక్కింది?..

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి మరణానంతరం ఆయన సమస్త ఆస్తుల విలువ సుమారు రూ.3,800 కోట్లుగా అంచనా. ఇందులో ఎక్కువ భాగాన్ని ఆయన తన సేవా సంస్థలకు కేటాయించారు. ఫిబ్రవరి 23, 2022న తయారు చేసిన వైలులో, ఆయన స్పష్టంగా సేవా కార్యక్రమాల కోసం ఈ ఆస్తిని ఉపయోగించాలని పేర్కొన్నారు. రతన్ టాటా ఎండోవ్‌మెంట్ ఫౌండేషన్ మరియు ఎండోవ్‌మెంట్ ట్రస్ట్‌కి ఈ నిధులు వెళ్తాయి. ఇవి విద్య, వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కుటుంబ సభ్యులకు రూ.800 కోట్లు

ఆయన కుటుంబ సభ్యులకు కూడా మంచి భాగాన్ని కేటాయించారు. సుమారు రూ.800 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లు, ఆర్ట్ కలెక్షన్స్, ఖరీదైన గడియారాలు వీరికి దక్కాయి. ఆయన సోదరీమణులు షిరిన్ జీజీబోయ్, డయానా జీజీబోయ్లతో పాటు మాజీ ఉద్యోగి మోహిని మ్. దత్తా ఈ ఆస్తులను పొందనున్నారు. రతన్ టాటా సోదరుడు జిమ్మీ నావల్ టాటాకి జూహూ బంగ్లాలో భాగం, వెండి పాత్రలు, ఆభరణాలు లభించాయి. ఇవి సిమోన్ టాటా, నోయెల్ టాటాతో పంచుకుంటారు.

బంధువులు, ఫ్రెండ్స్‌కూ ప్రత్యేక గిఫ్టులు

అతని ప్రియ మిత్రుడు మెహ్లీ మిస్త్రీకి అలిబాగ్‌లోని విల్లా, మూడు ఆయుధాల కలెక్షన్ (దీంట్లో .25 బోర్ పిస్టల్ కూడా ఉంది) ఇచ్చారు. సహాయకుడు శాంతను నాయుడు గారి విద్యా రుణం పూర్తిగా మాఫీ చేశారు. పక్కింటివారు జేక్ మాలెట్కి వడ్డీలేని విద్యా రుణం ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ఇది రతన్ టాటా గారి సహానుభూతికి గొప్ప ఉదాహరణ.

Related News

అంతర్జాతీయ ఆస్తులు, ఖరీదైన గడియారాలు, పెంపుడు జంతువులకు నిధి

విదేశాల్లో కూడా రతన్ టాటా ఆస్తులు ఉన్నాయి. సీషెల్స్‌లో రూ.40 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్, వెల్స్ ఫార్గో, మోర్గాన్ స్టాన్లే బ్యాంక్ ఖాతాలు, అల్కోవా, హౌమెట్ ఎయిరోస్పేస్ షేర్లు ఉన్నాయి. అదనంగా ఆయన దగ్గర 65 ఖరీదైన లగ్జరీ వాచెస్ ఉన్నాయి – బల్గారీ, పటెక్ ఫిలిప్, టిస్సాట్ వంటి బ్రాండ్స్ ఉన్నాయి.
అంతేకాదు, ఆయనకు ఎంతో ఇష్టమైన పెంపుడు జంతువులకు ఏడాదికి రూ.12 లక్షలు (ప్రతి క్వార్టర్‌కి రూ.30,000) ప్రత్యేకంగా కేటాయించారు.

అంతిమంగా, ఆస్తి పంపిణీకి కోర్టులో ప్రక్రియ

ఈ ఆస్తుల పంపిణీకి సంబంధించి బాంబే హైకోర్టులో అభ్యర్థన దాఖలు చేశారు. డారియస్ కంబాటా, మెహ్లీ మిస్త్రీ, షిరిన్, డయానా జీజీబోయ్ ఈ ప్రక్రియను చూసుకుంటున్నారు. విల్‌లో స్పష్టంగా పేర్కొనబడని ఆస్తులు ఎండోవ్‌మెంట్ ఫౌండేషన్ మరియు ట్రస్ట్‌కు సమంగా వెళ్తాయి. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు 6 నెలలు పట్టే అవకాశం ఉంది.

ఇది రతన్ టాటా గారి జీవితాన్ని, విలువలను ప్రతిబింబించే ఓ అద్భుత ఉదాహరణగా నిలుస్తుంది.