
ఈరోజుల్లో ఫ్లాగ్షిప్ ఫోన్ ఎంచుకోవడం అంటే అంత తేలిక కాదు. సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ వచ్చేసింది. అదే సమయంలో యాపిల్ కూడా తన iPhone 16 Pro Maxతో పోటీకి దిగింది. ధరలు ₹1.09 లక్షల నుంచి ₹1.34 లక్షల వరకు ఉంటే, ఎవరిదీ మెరుగైన డీల్? మనం ఇప్పుడు ప్రతి కోణంలో ఈ రెండింటినీ పోల్చి చూద్దాం.
Samsung Galaxy S25 Edge Snapdragon 8Elite ప్రాసెసర్‌తో వచ్చింది. ఇది 4.47GHz ఆక్టా-కోర్ CPUతో పని చేస్తుంది. 12GB RAMతో ఇది బహుళ పనుల కోసం బాగా పనికొస్తుంది. అటు iPhone 16 Pro Max కూడా Apple A18 Bionic చిప్‌తో వస్తోంది. ఇది 4.05GHz హెక్సా కోర్ ప్రాసెసర్‌తో కూడి ఉంది. 8GB RAMతో ఇది తక్కువ RAM ఉన్నా, ఎక్కువ బ్యాటరీ సేవ్ చేసే విధంగా రూపొందించబడింది.
అయితే స్పీడ్, మల్టీటాస్కింగ్, గేమింగ్ కోసం చూస్తే Samsung దే పైచేయి. భవిష్యత్ యాప్‌లు, హైఎండ్ పనులకు Galaxy S25 Edge మేము రెడీ అనిపిస్తుంది.
[news_related_post]Galaxy S25 Edge 6.7 అంగుళాల Dynamic AMOLED 2X స్క్రీన్‌తో వచ్చింది. దీని రిజల్యూషన్ 1440 x 3120 పిక్సెల్స్. 2600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఎండలోనూ స్పష్టంగా స్క్రీన్ కనిపిస్తుంది. HDR10+ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో విజువల్స్ అదుర్స్ అనిపిస్తాయి.
అటు iPhone 16 Pro Maxలో 6.9 అంగుళాల OLED స్క్రీన్ ఉంది. ఇది Dolby Vision, Dynamic Island, ProMotion వంటి అదనపు ఫీచర్లతో ఉంది. స్క్రీన్ కొంచెం పెద్దది కానీ బ్రైట్నెస్ పరంగా Samsung ముందు ఉంది.
ఈ సారి Apple చేతిలో బ్యాటరీ పరంగా అడ్వాంటేజ్ ఉంది. iPhone 16 Pro Max 4685mAh బ్యాటరీతో వస్తోంది. ఇది ఎక్కువసేపు నడుస్తుంది. Samsung S25 Edgeలో 3900mAh బ్యాటరీ ఉంది. రెండు ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. అయితే గేమింగ్ లేదా వీడియో కాలింగ్ ఎక్కువగా వాడే వారికి ఐఫోన్ లోపలే ఎక్కువ శక్తి ఉంటుంది.
Samsung Galaxy S25 Edge 200MP + 12MP కెమెరాలతో వచ్చినా, వీడియో lovers మాత్రం iPhone వైపు చూసే అవకాశముంది. Samsung 8K వీడియో 30fps వద్ద రికార్డ్ చేయగలదు. సెల్ఫీ కెమెరా 12MP.
అటు iPhone 16 Pro Maxలో మూడు కెమెరాలు ఉన్నాయి. రెండు 48MP సెన్సార్లు, ఒకటి 12MP అల్ట్రావైడ్. ఇందులో Dolby Vision, 4K వీడియోలు 120fpsలో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్రియేటర్లకు ఇది వరం లాంటిది. ఫోటో క్వాలిటీ మాత్రం Samsung అధిక పిక్సెల్స్‌తో ఆకట్టుకుంటుంది.
Samsung Galaxy S25 Edge ధర ₹1,09,999. iPhone 16 Pro Max ధర ₹1,34,900 నుంచి మొదలవుతుంది. ఇది వేరియంట్స్ ఆధారంగా మరింత పెరగవచ్చు. అంటే రెండు మధ్య ₹25,000 ధర తేడా ఉంది. తక్కువ ధరలో హై-ఎండ్ ఫీచర్లు కావాలనుకునేవారు Samsung వైపు మొగ్గుతారు. బ్రాండ్ విలువ, సాఫ్ట్వేర్ అనుభవం కోసం ఎక్కువ ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నవారు iPhone ఎంచుకుంటారు.
Samsung కొనుగోలు చేసేవారు ₹7,000 వరకు కూపన్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఉచిత EMI ఆఫర్ అందుబాటులో ఉంది. అటు Apple కొంటే కూడా టాప్ delivery టైమింగ్ ఉంటుంది. కానీ ఆఫర్లు తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి, Croma వెబ్సైట్లో iPhone 16 Pro Max ధర ₹1,37,900గా ఉంది. అక్కడే ఫ్రీ ఓన్డ్ మోడల్స్ ₹1,21,465 నుంచి దొరుకుతున్నాయి.
Samsung Galaxy S25 Edge స్లిమ్ బాడీ, పవర్ఫుల్ ప్రాసెసర్, క్లీన్ డిస్ప్లేతో ఆకట్టుకుంటుంది. ఇది టెక్ లవర్స్, గేమర్లు కోసం బెస్ట్ ఆప్షన్. అంతే కాదు, ధరలో కూడ ఆదా అవుతుంది.
iPhone 16 Pro Max లాంగ్ బ్యాటరీ, వీడియో ఫీచర్లు, iOS సాఫ్ట్వేర్ అనుభవంతో మెప్పిస్తుంది. ఇది వీడియో క్రియేటర్స్, సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లకు చాలా పనికొస్తుంది.
ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే… మీరు ఏ పనికీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. మీరు స్పీడ్ కోసం చూస్తున్నారా? ఫోటోలు తీయడానికా? వీడియో ఎడిటింగ్, వ్లాగింగ్కా? లేక బ్రాండ్ స్టేటస్కా? ఇప్పుడు ఎంచుకునే సమయం మీదే…