
ఈ మధ్య కాలంలో ఫోల్డబుల్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. పెద్ద డిస్ప్లే, ప్రీమియం ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో ఈ ఫోన్లు చాలామంది ఆకర్షిస్తున్నారు. మార్కెట్లో Vivo, Samsung, Google మూడు కంపెనీలు 2025లో అత్యుత్తమ ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేశాయి. అవే Vivo X Fold 5, Samsung Galaxy Z Fold 7 మరియు Google Pixel 9 Pro Fold. ఇవన్నీ టాప్ లెవెల్ ఫీచర్లతో వచ్చినవే అయినా, వాటి మధ్య తేడాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి ధరలు, ఫీచర్లు, కెమెరా, బ్యాటరీ వంటి అంశాలను సులభంగా తెలుగులో చూసేద్దాం.
Vivo X Fold 5 మోడల్ ధర ₹1,49,999. ఇందులో 16GB RAM మరియు 512GB స్టోరేజ్ ఉంటుంది. Samsung Galaxy Z Fold 7 మూడు వేరియంట్లలో లభిస్తుంది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర ₹1,74,999. 512GB వేరియంట్ ధర ₹1,86,999. 16GB RAM + 1TB వేరియంట్ ధర ₹2,10,999. Google Pixel 9 Pro Fold మాత్రం వాటన్నిటికంటే తక్కువ ధరలో ₹1,29,999కి Flipkartలో లభిస్తోంది. ఇందులో 16GB RAM + 256GB స్టోరేజ్ ఉంటుంది.
Vivo X Fold 5లో 8.03 అంగుళాల AMOLED ఇంటర్ స్క్రీన్ ఉంటుంది. ఇది 2480 × 2200 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది. కవర్ డిస్ప్లే కూడా 6.53 అంగుళాలు ఉండి అదే బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. Samsung Galaxy Z Fold 7లో 8 అంగుళాల QXGA+ డైనామిక్ AMOLED 2X డిస్ప్లే ఉంటుంది. ఇది 2600 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. కవర్ డిస్ప్లే 6.5 అంగుళాలు, ఫుల్ హెచ్డీ+ రెజల్యూషన్‌తో వస్తుంది. Google Pixel 9 Pro Foldలో 8 అంగుళాల LTPO OLED ఫ్లెక్స్ డిస్ప్లే ఉంటుంది. ఇది 2700 నిట్స్ బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది. కవర్ డిస్ప్లే 6.3 అంగుళాలు ఉంటుంది.
[news_related_post]
Vivo X Fold 5లో Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్, Adreno 750 GPU ఉంటాయి. Samsung Galaxy Z Fold 7లో Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. Pixel 9 Pro Foldలో Google తన స్వంత Tensor G4 చిప్‌ను ఇచ్చింది. అదనంగా Titan M2 సెక్యూరిటీ చిప్ ఉంటుంది.
Vivo X Fold 5లో 16GB LPDDR5X RAM, 512GB UFS 4.1 స్టోరేజ్ ఉంది. Samsungలో వేరియంట్లను బట్టి 12GB లేదా 16GB RAM, 256GB, 512GB లేదా 1TB స్టోరేజ్ లభిస్తుంది. Pixel 9 Pro Foldలో 16GB RAM, 256GB స్టోరేజ్ ఉంటుంది.
Vivo X Fold 5లో మూడు 50MP కెమెరాలు ఉంటాయి – ప్రైమరీ, అల్ట్రావైడ్, టెలిఫోటో (3x Zoom). ఫ్రంట్ కెమెరా రెండు 20MP లుగా వస్తుంది. Galaxy Z Fold 7లో 200MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. అదనంగా 12MP అల్ట్రా వైడ్, 10MP టెలిఫోటో కెమెరాలు ఉంటాయి. ఫ్రంట్ కెమెరాలు 10MP. Pixel 9 Pro Foldలో 48MP ప్రైమరీ కెమెరా, 10.5MP అల్ట్రావైడ్, 10.8MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. కెమెరా విభాగంలో ఫొటోగ్రఫీ ప్రియులకు ఇది బాగా నచ్చుతుంది.
Vivo X Fold 5లో 6000mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. Galaxy Z Fold 7లో 4400mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 25W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. Pixel 9 Pro Foldలో 4650mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Vivoలో WiFi, Bluetooth 5.4, USB-C 3.2, GPS, OTG ఉంటాయి. Samsungలో WiFi 7, Bluetooth 5.4, NFC ఉన్నాయి. Pixel 9 Pro Foldలో WiFi 7, Bluetooth 5.3, GPS, NFC, USB 3.2 Type-C ఉన్నాయి.
ధర విషయంలో చూసుకుంటే Pixel 9 Pro Fold అందుబాటులో ఉంది. కెమెరా మరియు Google అనుభవం కోరుకునేవారికి ఇది సూపర్ చాయిస్. ఒక పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, భారీ RAM, ప్రాసెసింగ్ కోసం చూస్తే Vivo X Fold 5 చాలా స్ట్రాంగ్ కాంపిటీటర్. కానీ Samsung Galaxy Z Fold 7 డిజైన్, డిస్ప్లే, బ్రాండ్ విలువ కోసం బెస్ట్ ఆప్షన్, అయితే ప్రీమియం ధర చెల్లించాల్సిందే.