ఏప్రిల్ 1 నుంచి 7 భారీ ఆర్థిక మార్పులు.. మీ పర్సుపై ఏ ప్రభావం పడబోతోందో తెలుసా?

కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. దీని వల్ల యూపీఐ అకౌంట్లు, ఏటీఎం ఛార్జీలు, కార్ల ధరలు, ఆదాయపు పన్ను నిబంధనలు సహా చాలా కీలకమైన మార్పులు అమలుకానున్నాయి. ఈ మార్పులు కోట్లు మంది ప్రజల దైనందిన జీవితం, ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ముందుగానే తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఏప్రిల్ 1 నుంచి మారే 7 ముఖ్యమైన ఆర్థిక నియమాలు

1. UPI అకౌంట్ మిస్సయితే… ఖాతా బంద్

  • NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) బ్యాంకులు, పేమెంట్ ప్రొవైడర్లకు మార్చి 31లోగా మిగిలిపోయిన లేదా రీసైకిల్ అయిన మొబైల్ నంబర్లను డేటాబేస్ నుంచి తొలగించాలని ఆదేశించింది.
  • మీ పాత నంబర్ UPI అకౌంట్‌కు లింక్ అయ్యి ఉంటే, మార్చి 31లోగా అప్‌డేట్ చేయండి. లేదంటే ఖాతా బంద్ అవ్వొచ్చు.

2. ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడం ఖరీదు

  •  ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకోవడంపై ఛార్జీలు పెరుగుతున్నాయి.
  •  మే 1 నుంచి ATM క్యాష్ విత్‌డ్రావల్ ఛార్జీ ₹17 నుంచి ₹19కి పెరుగుతుంది.
  •  మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ చెక్ వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు ₹6 ఛార్జీ ₹7కి పెరుగుతుంది.

3. ఏప్రిల్ 1 తర్వాత కార్ల ధరలు 4% పెరుగుతాయి

  •  మారుతి సుజుకి, హ్యూండాయ్, మహీంద్రా, టాటా మోటార్స్, రెనాల్ట్, కియా కార్ల ధరలను 2% – 4% వరకూ పెంచనున్నాయి.
  •  కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తే ఏప్రిల్ 1కి ముందు తీసుకుంటే డబ్బు ఆదా అవుతుంది!

4. సేవింగ్స్ అకౌంట్‌లో కనీస బ్యాలెన్స్ తప్పనిసరి

  •  ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే జరిమానా పడుతుంది.
  • మీ బ్యాంక్ కొత్త నిబంధనలు ఏవో ముందే తెలుసుకుని, అకౌంట్‌లో కనీస డబ్బు ఉంచండి.

5. RBI Positive Pay System (PPS) అమలు

  • ₹50,000 కంటే ఎక్కువ విలువైన చెక్ ఇష్యూ చేయాలంటే ముందుగా బ్యాంకుకు డిజిటల్‌గా సమాచారం అందించాలి.
  • చెక్ ఫ్రాడ్ నివారించడానికి RBI తీసుకున్న కీలకమైన చర్య ఇది.

6. ఆదాయపు పన్ను మినహాయింపు పెరుగుతుంది

  • 87A సెక్షన్ ప్రకారం పన్ను మినహాయింపు ₹25,000 నుంచి ₹60,000కి పెరుగుతుంది.
  • 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను తగ్గనుంది, కానీ కాపిటల్ గెయిన్స్ ఆదాయానికి ఇది వర్తించదు.
  •  మధ్యతరగతి ఉద్యోగులకు ఇది చాలా మంచి వార్త

7. GSTలో IDS సిస్టమ్ ప్రవేశం

  • ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (IDS) వ్యవస్థను ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తారు.
  • GST రెవెన్యూ సరైన రీతిలో రాష్ట్రాల మధ్య పంచేందుకు ఇది సహాయపడుతుంది.

ఈ మార్పులు మీ రోజువారీ ఖర్చులపై పెద్ద ప్రభావం చూపొచ్చు. ముందుగానే తెలుసుకుని ప్లాన్ చేసుకోండి