Dream11 ఎలా మొదలైంది?
హర్ష్ జైన్ కాలేజీలో చదువుతున్నప్పుడే మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ చేసాడు. అక్కడే ఫాంటసీ స్పోర్ట్స్ గురించి తెలిసింది. అదే తనకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. “ఇదే నా ఫ్యూచర్” అనుకున్న హర్ష్, చదువు పూర్తయ్యాక భారతదేశానికి వచ్చి, 2008లో తన ఫ్రెండ్ భవిత్ షేత్‌తో కలిసి Dream11 స్టార్ట్ చేశాడు. క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ వంటి గేమ్స్‌లో ఫాంటసీ లీగ్ ద్వారా ప్రజల ముచ్చట తీర్చేలా ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశాడు.
గేమింగ్‌లో విప్లవం
Dream11 ప్రారంభించినప్పుడు 150 మంది ఇన్వెస్టర్లు పెట్టుబడికి నో చెప్పారు. చాలామంది ఇది గ్యాంబ్లింగ్ అని కొట్టిపారేశారు. కోర్టు కేసులు, నెగిటివ్ కామెంట్స్. ఎన్నో ఎదుర్కొన్నాడు, కానీ వెనక్కి తిరిగి చూడలేదు. తన కాన్సెప్ట్ మీద నమ్మకంతో ముందుకు వెళ్లి, భారతదేశపు అతిపెద్ద ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశాడు.
2016లో కేవలం 20 లక్షల మంది మాత్రమే Dream11 వాడేవారు. కానీ 2024 నాటికి 22 కోట్ల మంది యూజర్లకు పైగా పెరిగిపోయింది. ఇప్పుడు Dream11 కేవలం గేమింగ్ కాదు, కోట్లాది మందికి ఆదాయ మార్గంగా మారిపోయింది.
Related News
హర్ష్ జైన్ ఎక్కడ చదివాడు?
హర్ష్ జైన్ 2001-2003 మధ్య సెవెనోక్స్ హైస్కూల్‌లో చదివాడు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మ్యాథ్స్, ఎకనామిక్స్ స్టడీ చేశాడు. 2012లో కొలంబియా బిజినెస్ స్కూల్‌లో MBA పూర్తిచేశాడు.
హర్ష్ జైన్ సంపాదన ఎంత?
Dream11 బూస్ట్ అయ్యాక హర్ష్ జైన్ నెట్ వర్త్ ₹5,500 కోట్లు ($660 మిలియన్) కు పెరిగింది. ప్రతి ఏటా అతని సంపాదన రెట్టింపు అవుతోంది.
వ్యక్తిగత జీవితం
2013లో హర్ష్ జైన్ తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్, డెంటిస్ట్ రచన షాతో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ క్రిష్ అనే కొడుకు ఉన్నాడు. 2021లో ₹72 కోట్లు పెట్టి, ముఖేష్ అంబానీ ఇంటికి దగ్గరలోనే లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొన్నాడు.
సక్సెస్ ఫార్ములా
ఒక మంచి ఐడియా, స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. హర్ష్ జైన్ స్టోరీ పెద్ద కలలు కనాలనే వాళ్లందరికీ ఇన్‌స్పిరేషన్. మీరు కూడా మీ ఐడియాను మరింత గ్రేట్‌గా మార్చే ప్రయత్నం చేయండి.