భారతదేశాన్ని రక్షించేందుకు ప్రతిరోజూ సరిహద్దుల్లో అలుపెరగకుండా గస్తీ వేసే సైనికుల త్యాగం మాటల్లో చెప్పలేం. వారు ప్రతీరోజూ తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారు. అయితే మన దేశంలో వారికిచ్చే జీతం, భత్యాలు ఏమేరకు న్యాయంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? సైన్యంలో ఉన్న ఉద్యోగుల వేతన వివరాలు, వారు పొందే అదనపు సౌకర్యాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారత సైన్యంలో జీతాల వ్యవస్థ ఎలా ఉంటుంది?
భారత సైన్యంలో ఉద్యోగులు ర్యాంకుల ఆధారంగా విభజించబడతారు. మొదటి స్థాయి ఉద్యోగి “సైనికుడు”. ఈ సైనికుడికి సుమారుగా రూ.25,000 జీతం లభిస్తుంది. ఇది ప్రాథమిక జీతం మాత్రమే. ఇతని తర్వాతి స్థాయి ఉద్యోగి ల్యాన్స్ నాయక్. ఇతనికి సుమారు రూ.30,000 వేతనం లభించే అవకాశముంది. ఇక నాయక్ స్థాయి ఉద్యోగికి రూ.35,000 వరకు జీతం వస్తుంది. హవల్దార్ కు జీతం సుమారు రూ.40,000 ఉండొచ్చు.
సబ్‌ఇన్‌స్పెక్టర్ స్థాయి ఉద్యోగుల జీతాలు ఎంత?
ఆర్మీలో ఉన్న నాయబ్ సుబేదార్ కు సుమారు రూ.45,000 జీతం వస్తుంది. ఇక సుబేదార్‌కు సుమారు రూ.50,000 జీతం లభిస్తుంది. సుబేదార్ మేజర్‌కు ఇది మరింతగా పెరిగి సుమారుగా రూ.65,000 వరకు ఉండొచ్చు. ఇక ఆఫీసర్ల స్థాయికి వస్తే, లెఫ్టినెంట్ స్థాయి ఉద్యోగికి సుమారుగా రూ.68,000 జీతం వస్తుంది. కెప్టెన్ ఉద్యోగికి ఇది సుమారుగా రూ.75,000 ఉండొచ్చు.
ఆఫీసర్‌ల జీతాలు వినగానే ఆశ్చర్యపోతారు
ఇక మేజర్ స్థాయి అధికారికి సుమారు రూ.1 లక్ష జీతం లభిస్తుంది. లెఫ్టినెంట్ కల్నల్ కు జీతం సుమారుగా రూ.1,12,000 ఉండొచ్చు. కల్నల్‌కు ఇది మరింత పెరిగి రూ.1,30,000 కు చేరుతుంది. బ్రిగేడియర్ స్థాయి అధికారికి జీతం సుమారుగా రూ.1,39,000 నుంచి రూ.2,27,000 వరకు ఉండవచ్చని అంచనా. మేజర్ జనరల్ ఉద్యోగికి ఇది రూ.1,44,000 నుంచి రూ.2,18,800 వరకూ ఉండొచ్చు.
ఇక ఆర్మీ టాప్ స్థాయిలో ఉండే లెఫ్టినెంట్ జనరల్‌కు సుమారుగా రూ.1,82,200 నుంచి రూ.2,24,100 వరకూ జీతం వస్తుంది. చివరగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) అంటే ఆర్మీచీఫ్‌కు నెలకు రూ.2,50,000 వేతనం లభించే అవకాశం ఉంది. ఇది అత్యున్నత స్థాయి జీతం.
వేతనంతో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు
భారత సైన్యంలో జీతం మాత్రమే కాదు, అదనంగా ఎన్నో అలవెన్స్‌లు కూడా లభిస్తాయి. వీటిలో మొదటిది డియర్‌నెస్ అలవెన్స్ (DA), అంటే కరువు భత్యం. ఇది ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి లభించే ప్రాథమిక అలవెన్స్. అయితే సైనికులకు ప్రత్యేకంగా మిలిటరీ సర్వీస్ పే (MSP) అనే అదనపు భత్యం కూడా లభిస్తుంది. ఇది సాధారణ ఉద్యోగుల కంటే భిన్నంగా ఉంటుంది.
ఇంకా సైనికులకు ఇంటి అద్దె భత్యం (HRA), రవాణా భత్యం (TA), ఫీల్డ్ ఏరియా అలవెన్స్, హై ఆల్టిట్యూడ్ అలవెన్స్, స్పెషల్ డ్యూటీ అలవెన్స్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే, ఒక సైనికుడికి లభించే మొత్తం వేతనం చాలా మంచి స్థాయిలో ఉంటుంది.
సైనికులకు వైద్య సౌకర్యాలు ఎలా ఉంటాయి?
ఆర్మీలో పనిచేసే వారు కేవలం జీతం, భత్యాలు మాత్రమే కాకుండా, మెరుగైన వైద్య సౌకర్యాలను కూడా పొందుతారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ వైద్య సేవలు లభిస్తాయి. ఇది ఎంతో గొప్ప ప్రయోజనం.
రిటైర్మెంట్ తరువాత కూడా సైనికుడికి లాభాలే
భారత ఆర్మీ ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత కూడా పింఛన్ రూపంలో నెల నెలా ఆదాయం పొందుతారు. దీనితో పాటు కొన్ని రకాల గ్రాట్యుటీ, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి లాభాలు కూడా లభిస్తాయి. పదవీ విరమణ తర్వాత కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, కాన్టిబ్యూటరీ హెల్త్ స్కీం (ECHS) ద్వారా మరిన్ని సేవలు అందుతాయి.
ఇవన్నీ తెలిసాక మీరు ఆర్మీలో చేరాలని అనిపించకమానదు
ఒక దేశ రక్షణ కోసం పని చేయడం ఎంతో గౌరవంగా ఉంటుంది. అలాంటి పని చేస్తున్న వారికి ప్రభుత్వం మంచి జీతంతో పాటు ఎన్నో సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. దేశానికి సేవ చేయాలన్న స్ఫూర్తి ఉన్నవారు, సైన్యంలో చేరాలనుకునే యువత ఇది మంచి అవకాశం.
భారత సైనికుడి జీతం, ప్రయోజనాలు తెలుసాక, ఆ ఉద్యోగానికి ఎంత విలువ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆర్మీలో ఉద్యోగం పొందితే, జీవితాంతం గౌరవంతో పాటు భద్రతా ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే దేశానికి సేవ చేయాలనే యువతకు భారత ఆర్మీ ఒక అద్భుతమైన అవకాశం.
గమనిక: పై జీతాల వివరాలు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడ్డాయి. భద్రతా కారణాల వల్ల కొన్ని వివరాలు మారే అవకాశం ఉంది. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే.