సాధారణంగా మన దగ్గర డబ్బు ఉంటే దాన్ని సేవింగ్స్ ఖాతాలో పెట్టి ఉంచుతాం. ఎందుకంటే ఎమర్జెన్సీలో అవసరమైనప్పుడు డబ్బు తీసుకోవచ్చు. అదే సమయంలో బ్యాంకులు మన డిపాజిట్‌పై వడ్డీ కూడా ఇస్తుంటాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే – మన డబ్బు బ్యాంకులో సురక్షితంగా ఉంటుంది. చాలా మంది ఎక్కువ వడ్డీ కోసం FDలు కూడా చేస్తారు. ఎందుకంటే ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై బ్యాంకులు బంపర్ వడ్డీ ఇస్తుంటాయి.
అయితే FDకి ఒక సమస్య
FDలో డబ్బు పెట్టగానే అది లాక్ అయిపోతుంది. అంటే ఆ డబ్బును ఎమర్జెన్సీలో తక్షణమే తీసుకోవడం కష్టం. ఎక్కువ బ్యాంకులు ముందుగానే FD బద్దలుకొట్టాలంటే పెనాల్టీ గా వడ్డీ తగ్గిస్తాయి. అంటే మనం సంపాదించాల్సిన లాభం తక్కువ అవుతుంది. ఇప్పుడు దీనికి మంచి అల్‌టర్నేటివ్ వచ్చేసింది.
సేవింగ్స్ ఖాతాలోనే FD వడ్డీ వచ్చేస్తుంది
అదే స్వీప్-ఇన్ FD. ఇది ఒక ఆటోమేటిక్ sweep-in సర్వీస్. అంటే మీ సేవింగ్స్ ఖాతాలో మీ వద్ద నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ డబ్బు ఉన్నా, అదనంగా ఉన్న డబ్బును బ్యాంక్ ఆటోమేటిగ్గా FDగా మార్చేస్తుంది. దీని వలన సేవింగ్స్ ఖాతాలో FD వడ్డీ రేట్‌తో లాభాలు వస్తాయి. అదే సమయంలో అవసరమైనప్పుడు డబ్బును తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక రకంగా FD లాభాలు + సేవింగ్స్ ఖాతా ఫ్లెక్సిబిలిటీ.
స్వీప్-ఇన్ FD ఎలా పనిచేస్తుంది?
మనం బ్యాంక్‌కి వెళ్లి ఈ సర్వీస్‌కి అప్లై చేయాలి. కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్‌గానూ ఈ ఆప్షన్ ఇస్తున్నాయి. మీరు మీ సేవింగ్స్ అకౌంట్‌కి లింక్ చేసినా సరే, మీరు నిర్ణయించిన డబ్బు కంటే ఎక్కువగా మీ ఖాతాలో ఉండగానే మిగతా డబ్బు ఆటోమేటిగ్గా FDకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందులో వడ్డీ కూడా FD రేట్ ప్రకారమే వస్తుంది.
వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
ప్రతి బ్యాంక్‌కు వేరు వేరు నిబంధనలు ఉంటాయి. కొన్నింటిలో కనీసం ₹5,000 లేదా ₹10,000 ఉన్నప్పుడే ఈ సేవ అందుబాటులోకి వస్తుంది. అలాగే FDకి ఎంత కాలానికి డబ్బు లాక్ అవుతుంది, ఎప్పుడు వడ్డీ ఇవ్వాలి అనే వివరాలు కూడా బ్యాంక్ ఆధారంగానే ఉంటాయి. కొన్ని బ్యాంకులు 7 రోజులు నుంచి ప్రారంభిస్తే, మరికొన్ని 180 రోజులు లేదా 1 సంవత్సరాల FD చేయడం లాంటివి చేస్తుంటాయి.
ఎమర్జెన్సీలో డబ్బు ఎలా తీసుకోవాలి?
మీరు ఏదైనా అత్యవసర పరిస్థితిలో డబ్బు తీసుకోవాలంటే, మీ FD నుంచి డబ్బు ఆటోమేటిగ్గా బ్రేక్ అవుతుంది. అయితే దీని మీద కొంత పెనాల్టీ వడ్డీ మినహాయిస్తారు. ఇది ఎక్కువగా 1 శాతం వరకు ఉంటుంది. కానీ ఇది కూడా బ్యాంక్ ఆధారంగా మారవచ్చు. కొన్ని బ్యాంకులు FD బ్రేక్ చేసినా ఎక్కువగా వడ్డీ తగ్గించవు.
ఇది ఎవరికీ బాగా ఉపయోగపడుతుంది?
మీ సేవింగ్స్ ఖాతాలో ఎక్కువగా బ్యాలెన్స్ ఉండే వారు ఈ సర్వీస్‌ను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మినిమమ్ బ్యాలెన్స్ కంటే ఎక్కువ డబ్బు బ్యాంక్‌లో ఉంచేవారు FD లాభాలు కూడా పొందగలరు. ఇది చిన్న ఉద్యోగులు, ఫ్రీలాన్స్ వర్కర్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్గాల వారికి చాలా ఉపయోగపడుతుంది.
చివరగా చెప్పాలంటే
మీ సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉంచుకుంటూ FD లాంటి వడ్డీ పొందాలంటే వెంటనే మీరు స్వీప్-ఇన్ FD సర్వీస్‌కి అప్లై చేయండి. ఇకపై డబ్బు లాక్ అయ్యే భయం ఉండదు. ఎప్పుడు కావాలన్నా డబ్బు తీసుకోవచ్చు. అదే సమయంలో మంచి వడ్డీ రేట్లు కూడా వస్తాయి. ఇది డబ్బు సేవింగ్ కోసం అందరికీ తప్పనిసరి ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు మీరు స్వీప్-ఇన్ FD తీసుకోకపోతే, బాగున్న ఓ చాన్స్ మిస్ అవుతున్నట్టే…