మనకు జీతం వచ్చినంత మాత్రాన సరిపోదు… దాన్ని ఎలా మేనేజ్ చేయాలో కూడా మనకు తెలిసి ఉండాలి. కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి. కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టాలి. అలా డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని సురక్షితంగా పెంచుకోవడమూ అవసరం. అందుకే ఈ రోజు మీకు 5 సింపుల్ ఫైనాన్షియల్ ప్లాన్ల గురించి చెప్పబోతున్నాం. వీటిలో ఒక్కొక్కటి కూడా మీ భవిష్యత్తును భద్రపరిచేలా చేస్తాయి.
1. ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)
ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటేనే సురక్షిత పెట్టుబడి. మీరు రూ.1 లక్ష FDలో పెట్టితే, 5–7% వడ్డీతో 5 ఏళ్లలోనే అదనంగా రూ.30,000 వరకు లాభం వస్తుంది. మీ డబ్బు రిస్క్ లేకుండా బ్యాంకులోనే భద్రంగా ఉంటుంది. చిన్నపాటి పొదుపు అయినా FDలో వేస్తే మెల్లిగా పెరిగిపోతుంది.
2. బంగారంలో పెట్టుబడి
ఇంకొంచెం డబ్బు బంగారంలో పెట్టాలి. బంగారం ధరలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. మీరు నెలకు రూ.2,000 చొప్పున బంగారానికి పెట్టుబడి పెడితే, కొన్ని సంవత్సరాల్లో మంచి విలువ వస్తుంది. ఇది రిస్క్ లేని, అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి.
Related News
3. మ్యూచువల్ ఫండ్ SIP
మీ భవిష్యత్తు డ్రీమ్స్ కోసం మ్యూచువల్ ఫండ్ SIPలు తప్పనిసరిగా చేయాలి. మీరు నెలకు కేవలం రూ.5,000 చొప్పున 15 ఏళ్లు పెట్టుబడి పెడితే, సగటు 12% రిటర్న్స్‌తో మీకు రూ.20 లక్షల వరకూ వచ్చే అవకాశం ఉంది. ఇది మార్కెట్ ఆధారిత పెట్టుబడి అయినా, లాంగ్ టర్మ్‌కు చాలా బాగా పనిచేస్తుంది.
4. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
PPF స్కీం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అత్యంత భద్రత కలిగిన ప్లాన్. ఇందులో వడ్డీ రేటు 7.1% ఉంటుంది. మీరు ఇక్కడ పెట్టిన డబ్బు ట్యాక్స్ మినహాయింపు పొందుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడి కావాలనుకునే వారికి ఇది బెస్ట్.
5. ఇన్సూరెన్స్ – భవిష్యత్తుకు భరోసా
జీవితంలో అనుకోని ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ పాలసీ తీసుకుంటే, మీ కుటుంబాన్ని ఆర్థికంగా భద్రపరచవచ్చు. ఒక్కసారి చిన్న ప్రీమియం చెల్లించినా, ఆపదల్లో కోటిలాంటి రక్షణ కలుగుతుంది.
సింపుల్ పెట్టుబడులు – బిగ్ ఫలితాలు
మీ డబ్బును ఈ 5 ప్లాన్లలో స్మార్ట్‌గా మేనేజ్ చేయండి. కేవలం నెలకు రూ.5,000 పెట్టుబడి పెడితే… 15–20 ఏళ్లలోనే రూ.20 లక్షలు+ మీ కోసం ఎదురు చూస్తుంటాయి. ఇప్పుడు ప్లాన్ చేయకపోతే… రేపటికి చింత తప్పదు. మొదలు పెట్టండి – భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.