Google మన జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. కానీ, Google ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చని మీకు తెలుసా? మీరు ఇంట్లోనే కూర్చొని Google సౌకర్యాలను సరిగ్గా వాడుకుంటే నెలకు మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
ఇక్కడ 5 సులభమైన మార్గాలు ఉన్నాయి, మీరు ఇంట్లో నుంచే Google ద్వారా సంపాదించవచ్చు.
Google AdSense – వెబ్‌సైట్ లేక బ్లాగ్ ద్వారా ఆదాయం
మీ దగ్గర వెబ్‌సైట్ లేదా బ్లాగ్ ఉందా?Google AdSense ద్వారా మీ వెబ్‌సైట్‌లో ప్రకటనలు చూపించండి, క్లిక్స్ వస్తే డబ్బులు వస్తాయి.
Related News
మీ వెబ్‌సైట్‌కు ఎక్కువ మంది వస్తే, మీ ఆదాయం కూడా పెరుగుతుంది.చాలా మంది బ్లాగర్లు AdSense ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు.
Google Opinion Rewards – సర్వేలు పూర్తి చేసి డబ్బులు పొందండి
Google Opinion Rewards అనేది చిన్న సర్వేలు పూర్తి చేసి డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడే యాప్.యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, కొన్ని సర్వేలు పూర్తి చేస్తే Google Play Storeలో వాడేందుకు లేదా PayPal ద్వారా నేరుగా డబ్బుగా పొందవచ్చు.ఒక్కో సర్వేకు ₹80 వరకు పొందవచ్చు.స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, డబ్బు సంపాదించొచ్చు..
Google Play Store – యాప్‌ల ద్వారా డబ్బు సంపాదించండి
మీకు యాప్‌ల డెవలప్‌మెంట్ మీద నైపుణ్యం ఉందా?Google Play Storeలో యాప్‌లను అప్‌లోడ్ చేసి డౌన్‌లోడ్స్, యాడ్స్, లేదా ఇన్-యాప్ పర్చేస్‌ల ద్వారా ఆదాయం పొందండి. ₹2,000 పెట్టుబడి పెట్టి లక్షల్లో సంపాదిస్తున్న డెవలపర్లు చాలామంది ఉన్నారు..అర్ధం చేసుకొని చక్కగా ప్లాన్ చేసుకుంటే, ఇది సూపర్ ఆప్షన్.
Google Play Books – మీ సొంత పుస్తకాల ద్వారా ఆదాయం
మీరు రాయడం అంటే ఇష్టపడితే, మీ సొంత పుస్తకాన్ని Google Play Booksలో అప్‌లోడ్ చేయండి.Google మీ పుస్తకాన్ని విక్రయించి, ప్రతి కొనుగోలుపై మీకు డబ్బు చెల్లిస్తుంది. PDF లేదా EPUB ఫార్మాట్‌లో మీ పుస్తకాన్ని అప్‌లోడ్ చేస్తే చాలు.రచయితల కోసం ఇది గొప్ప అవకాశంగా మారింది.
YouTube – వీడియోలతో ఆదాయాన్ని ఆర్జించండి
YouTube ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నవారు ఎంతోమంది…మీ చానల్‌ను Google AdSenseతో కనెక్ట్ చేసి యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
అర్హత పొందడానికి:
1,000 సబ్‌స్క్రైబర్లు + గత 12 నెలల్లో 4,000 గంటల వాచింగ్.లేదా, 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్ వీడియో వ్యూస్ + 1,000 సబ్‌స్క్రైబర్లు.Technical Guruji లాంటి వారు YouTube ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు… మీకు టాలెంట్ ఉంటే, మీకూ ఇదే అవకాశం.
Google సహాయంతో ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించండి. ఆలస్యం చేయకుండా ఇదే రోజున ప్రయత్నించడం మొదలు పెట్టండి.