Government scheme: ఒకే ఇంట్లో ఇద్దరికి ఉచిత గ్యాస్ సిలిండర్ వస్తుందా?.. సమాధానం ఇక్కడే..

మన దేశంలో ఒకప్పుడు చెరకు పొయ్యిలపై అన్నం వండేవారు. పొగతో ఆరోగ్య సమస్యలు వచ్చేవి. అయితే 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన “ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన”తో ఇది పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కోట్లాది మహిళలు ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద వంట చేయడం మొదలుపెట్టారు. పేద కుటుంబాలకు ఇది నిజంగా ఒక గొప్ప వరం అయ్యింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఉజ్వలా యోజన అంటే ఏమిటీ? ఎవరికీ లభిస్తుంది?

ఈ పథకం ద్వారా పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వబడుతుంది. దీంట్లో గ్యాస్ స్టవ్, మొదటి సిలిండర్ పూర్తిగా ఉచితం. ఎటువంటి డిపాజిట్ లేకుండా కనెక్షన్ లభిస్తుంది. గ్యాస్ బిల్లు చెల్లించే సామర్థ్యం లేని కుటుంబాల కోసం ఈ పథకం తీసుకొచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగం పెరిగేందుకు ఇది ఎంతో దోహదపడింది.

ఇక అసలు ప్రశ్న – ఒకే ఇంట్లో ఇద్దరికి ఉజ్వల కింద కనెక్షన్ వస్తుందా?

చాలా మందికి దీనిపై డౌట్ ఉంటుంది. ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే వాళ్లిద్దరికీ ఉజ్వల కనెక్షన్ వస్తుందా అన్నది. దీనికి సూటిగా సమాధానం – కాదు. ప్రభుత్వం పథకం కింద ఒక్క కుటుంబానికి మాత్రమే ఒక కనెక్షన్ ఇస్తుంది. అంటే ఒక ఇంట్లో ఒకరికి గ్యాస్ కనెక్షన్ వచ్చిందంటే, మరొకరికి అదే ఇంట్లో గ్యాస్ కనెక్షన్ రాదు.

Related News

కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో

ఇక్కడ ఓ కీలక విషయం ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు వేర్వేరు ఇళ్లలో ఉంటే, వారి పేర్లకు వేర్వేరు రేషన్ కార్డులు, వేరు ఫ్యామిలీ ఐడీ ఉంటే – అప్పుడు ఇద్దరికీ కూడా ఉజ్వల యోజన కింద కనెక్షన్ రావచ్చు. ఈ విషయాన్ని బట్టి చూస్తే, వాస్తవానికి ఇల్లు వేరైతే, ఆధారాలు వేరైతే వారు అర్హులవుతారు.

అయితే దీనికి పూర్తి పరిశీలన ఉంటుంది. మీ ఆధార్, బ్యాంక్ డిటెయిల్స్, కుటుంబ ధృవీకరణ – అన్నీ చెక్ చేస్తారు

ఇందుకు గ్యాస్ ఏజెన్సీ మరియు ఆయిల్ కంపెనీలు పూర్తిగా వెరిఫికేషన్ చేస్తాయి. మీ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఫ్యామిలీ ఐడీ వంటివన్నీ పరిశీలించాకే కనెక్షన్ మంజూరు చేస్తారు. అర్హతలు పూర్తిగా ఉండాలని ఖచ్చితంగా చూస్తారు. ఎలాంటి తప్పు ఉన్నా లేదా డూప్లికేట్ అప్లికేషన్ ఉన్నా వెంటనే తిరస్కరిస్తారు.

ఉజ్వల యోజనతో లభించే ప్రయోజనాలు

ఉజ్వల పథకం కింద లబ్దిదారులు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ పొందుతారు. తొలిసారి గ్యాస్ సిలిండర్‌తో పాటు స్టవ్ కూడా ఉచితంగా అందుతుంది. అలాగే కొంతమందికి సబ్సిడీ ద్వారా రెండవ, మూడవ సిలిండర్లు తక్కువ ధరకు లభిస్తాయి. దీని వల్ల వంటలో వినియోగించే పొగలు తగ్గి ఆరోగ్యం మెరుగవుతుంది. మహిళలకు సమయం ఆదా అవుతుంది, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు.

ఇప్పుడు అప్లై చేయాలంటే ఏమి చేయాలి?

ఉజ్వల యోజనకు అప్లై చేయాలంటే మీ సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి. అక్కడ దరఖాస్తు ఫారం నింపి, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వండి. గ్రామ లేదా పట్టణ స్థాయి అధికారుల ధృవీకరణ అనంతరం కనెక్షన్ మంజూరు చేస్తారు.

ప్రభుత్వం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి చర్యలు తీసుకుంటోంది. అయినా కూడా కొందరు ఇప్పటికీ దీని లాభాలు పొందలేదు. కనుక మీరు ఇంకా అప్లై చేయకపోతే, లేదా మీ కుటుంబంలో అర్హులైనవారికి ఈ విషయం తెలియనట్లయితే వెంటనే షేర్ చేయండి. మరింత ఆలస్యం చేస్తే అవకాశాన్ని కోల్పోతారు.

ఇలాంటి విలువైన పథకం కింద మీరు ప్రయోజనం పొందాలని కోరుకుంటే – వివరాలు తెలుసుకుని ఇప్పుడే అప్లై చేయండి…మీకు, మీ కుటుంబానికి ఇది మార్గదర్శకంగా నిలవండి…