కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ఆయుష్మాన్ భారత్ యోజన” పథకం కింద 70 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేకంగా “ఆయుష్మాన్ వయ వందన కార్డు” అందిస్తున్నారు. ఈ కార్డు ఉన్న వారు ఏ హాస్పిటల్‌కైనా వెళ్లి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందే అవకాశం ఉంది.
70 ఏళ్లు దాటినవారికి ఎలాంటి అర్హతా నిబంధనలు లేవు
సాధారణంగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో చేరాలంటే కొన్ని అర్హతలు అవసరం. కానీ 70 ఏళ్లు దాటిన వారు మాత్రం ఎలాంటి అర్హతా ప్రమాణాలు లేకుండానే ఈ కార్డు పొందవచ్చు.ఒకవేళ కుటుంబంలో 70 ఏళ్లు పైబడిన వ్యక్తి ఉంటే, ఆయుష్మాన్ కార్డు ద్వారా అదనంగా మరో రూ.5 లక్షల వరకు ట్రీట్‌మెంట్ పొందే అవకాశముంది.
ఆయుష్మాన్ వందన కార్డు ప్రయోజనాలు
ఏ ఆసుపత్రికైనా వెళ్లి ఉచిత వైద్యం పొందొచ్చు..సంవత్సరానికి రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది..అదనపు టాప్-అప్ ద్వారా మరో రూ.5 లక్షల వరకు మెడికల్ కవరేజ్ పొందే అవకాశం..ఎటువంటి ఆదాయ ప్రమాణం లేకుండా అందరికీ లభిస్తుంది
Related News
70 ఏళ్లు నిండిన వారు కార్డు పొందాలంటే?
ఈ కార్డును పొందడానికి ఎటువంటి ప్రత్యేకమైన దరఖాస్తు అవసరం లేదు..70 ఏళ్లు దాటిన వారందరికీ ఈ కార్డు లభిస్తుంది..మీరు అర్హులా కాదు అని తెలుసుకోవాలంటే PMJAY అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి ‘AM I Eligible’ అనే ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.