ఈ రోజుల్లో చాలామంది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ మీద ఆధారపడుతున్నారు. కానీ అందరికీ UPI నచ్చదు… ఇంకా చాలా మంది, ముఖ్యంగా వ్యాపారాల్లో, క్యాష్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందుకే ఇంట్లో కూడా చాలామంది డబ్బు నిల్వ చేసుకుంటుంటారు. కానీ, మీ ఇంట్లో ఎక్కువ మొత్తంలో కాష్ ఉంచితే కొన్ని రూల్స్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుండి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇన్కమ్ ట్యాక్స్ నియమాల ప్రకారం, ఇంట్లో క్యాష్ ఉంచడానికి ప్రత్యేకమైన లిమిట్ లేదు. మీరు ఆర్థికంగా బలంగా ఉంటే ఎంత కాష్ అయినా ఉంచుకోవచ్చు. కానీ ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పగలగాలి. మీరు ఎప్పుడైనా ప్రశ్నించబడితే, ఆ డబ్బుకు మీరు రిటర్న్ ఫైల్ చేసిన పూర్వపు ITR లేదా ఇతర ఆధారాలు చూపాలి.
మీ దగ్గరున్న క్యాష్‌కు సోర్స్ చెప్పలేకపోతే పెద్ద సమస్య అవుతుంది. ఇలాంటప్పుడు డిపార్ట్‌మెంట్ మీరు చెల్లించిన ట్యాక్స్‌ను పరిశీలిస్తుంది. దాచిన డబ్బు కనపడితే, మీపై జరిమానా వేయడమే కాకుండా, ఆ డబ్బును సీజ్ చేసే అవకాశముంది. కొన్నిసార్లు అరెస్టు కూడా అవ్వవచ్చు.
Related News
న్యూస్‌లలో చూస్తుంటాం కదా, కొంతమంది అధికారుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగి కోట్లు విలువైన డబ్బు బయటపడుతుంది. అవన్నీ అక్రమ డబ్బులే. డిపార్ట్‌మెంట్ మొదటగా ఆ డబ్బు సోర్స్ ఏంటి అని అడుగుతుంది. చెప్పలేకపోతే, ఆ డబ్బు సీజ్ చేసి, వ్యక్తిపై కేసు పెడతారు. కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బుకి సరైన ఆధారాలు ఉండాలే కానీ, సమస్య తలెత్తదు.
ఇంకా కొన్ని ముఖ్యమైన నిబంధనలు తెలుసుకోవాలి. ఒకేసారి ₹50,000 కన్నా ఎక్కువ క్యాష్ బ్యాంక్ ఖాతా నుండి విత్‌డ్రా లేదా డిపాజిట్ చేస్తే, PAN కార్డు చూపాలి. ఇంకా, గత మూడు సంవత్సరాలలో ITR ఫైల్ చేయని వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో ₹20 లక్షలకు మించిన డబ్బు విత్‌డ్రా చేస్తే 2% TDS పడుతుంది. ₹1 కోట్లకు మించిన క్యాష్ అయితే 5% TDS చెల్లించాలి. ITR ఫైల్ చేసినవారికి మాత్రం ₹1 కోటి వరకు టిడిఎస్ లేకుండా తీసుకోవచ్చు.
ఇవన్నీ తెలుసుకోకుండా ఇంట్లో ఎక్కువ డబ్బు ఉంచడం చాలా ప్రమాదం. మీరు ₹10 లక్షలు ఇంట్లో ఉంచుతుంటే, ఒక్కసారి అయినా ఆ డబ్బుకు సోర్స్ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచండి. లేకపోతే, చిన్న తప్పిదం మీదే భారీ జరిమానా పడొచ్చు.