ఇన్వెస్ట్‌మెంట్ అంటే చాలా మందికి భయం. కానీ, అసలు సంగతి ఏంటంటే… ఎక్కువ సంపాదించాలంటే సరైన ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిందే. దీనికి బలమైన నిదర్శనంగా నిలిచింది SBI లాంగ్ టర్మ్ ఎక్విటీ ఫండ్. ఇది ఓ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్. దీని రాబడులు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే.
ఈ ఫండ్ మార్చి 31, 1993న ప్రారంభమైంది. ఇప్పుడు దానికి 32 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ రోజు నుంచి ఎవరైనా నెలకు ₹5,000 చొప్పున SIP చేస్తూ ఉంటే, ఇప్పటికి అంటే మార్చి 28, 2025 వరకు వాళ్ల పెట్టుబడి విలువ సుమారు ₹7.22 కోట్లు అయ్యేది… అంటే కేవలం ₹19.25 లక్షలు పెట్టి… రూ. 7 కోట్లకు పైగా సంపాదించగలిగారు.
ఇంకా చెప్పాలంటే, అదే ఫండ్‌లో నెలకు ₹10,000 చొప్పున SIP చేసినవారు ₹14.44 కోట్లకు చేరుకున్నారు. ఇది వార్షికంగా సగటున 17.94% CAGR రాబడి. ఈ ఫండ్‌లో మిగతా రాబడులు ఇలా ఉన్నాయి –
Related News
3 సంవత్సరాల రాబడి: 23.42%,5 సంవత్సరాల రాబడి: 24.31%,10 సంవత్సరాల రాబడి: 17.59%,15 సంవత్సరాల రాబడి: 16.03%
ఈ ఫండ్ మేనేజర్ పేరు దినేష్ బాలచంద్రన్. 2016 నుండి ఆయనే ఈ ఫండ్‌ని నిర్వహిస్తున్నారు. ఇది ELSS (ఎక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం) కాబట్టి, ఇన్‌వెస్ట్ చేసిన డబ్బును 3 సంవత్సరాల పాటు విత్‌డ్రా చేయలేరు. అయితే, ఇది ట్యాక్స్ మినహాయింపు (80C కింద) కూడా ఇస్తుంది.
ఈ ఫండ్ అనేది ఎక్కువ రిస్క్‌తో కూడినది కాబట్టి, దీని గురించి ముందుగా తెలుసుకొని తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అయితే, దీర్ఘకాలికంగా SIP చేస్తూ వెళితే రిస్క్ తగ్గుతుంది, రాబడులు పెరుగుతాయి.
ఇప్పుడైనా ఆలస్యం చేయకుండా… మీ నెలకు ఖర్చులోని ₹5,000ని మీ భవిష్యత్తు కోసమే పెట్టుబడిగా మార్చండి. 20–25 ఏళ్ల తర్వాత అది కోట్లు అవ్వడం ఖాయం! SIP మొదలుపెట్టకపోతే నష్టమో నష్టం.