EPS పెన్షన్ అంటే ఏమిటి? EPS (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) ఉద్యోగుల భవిష్యత్తును ఆర్థికంగా భద్రపరచే స్కీమ్. ఈ స్కీమ్‌ను EPFO (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నిర్వహిస్తుంది. ఉద్యోగి మరియు యజమాని EPFకి 12% చొప్పున చెల్లిస్తారు, ఇందులో యజమాని వాటాలో 8.33% EPSకి వెళ్తుంది.
EPS పెన్షన్ పొందేందుకు అర్హత ఏమిటి?
కనీసం 10 ఏళ్ల సేవ పూర్తి చేయాలి. 50 ఏళ్ల వయసు దాటితే ఎర్లీ పెన్షన్, 58 ఏళ్ల వయసు దాటితే రెగ్యులర్ పెన్షన్ పొందవచ్చు. EPFO సభ్యులుగా ఉండాలి.
EPS పెన్షన్ ఎలా లెక్కించబడుతుంది?
EPS పెన్షన్ లెక్కించడానికి ఫార్ములా: (పెన్షనబుల్ సాలరీ x పెన్షనబుల్ సర్వీస్) / 70. ఉదాహరణకి, ₹35,000 బేసిక్ సాలరీతో 30 ఏళ్ల సేవ ఉన్న ఉద్యోగికి గరిష్ట పెన్షనబుల్ సాలరీ ₹15,000 గణనలోకి తీసుకుంటారు. (₹15,000 × 30) / 70 = ₹6,429 నెలసరి పెన్షన్.
Related News
EPS పెన్షన్ లాభాలు ఏమిటి?
నిరంతర ఆదాయం: ఉద్యోగం లేకున్నా పింఛన్ అందుతుంది. భద్రత: ప్రభుత్వ హామీతో రిస్క్ లేకుండా డబ్బు లభిస్తుంది. ఎక్కువ కాలం పని చేస్తే పెన్షన్ పెరుగుతుంది.
మీరు ఇంకా EPS గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నెలకు ₹6,429 పెన్షన్ పొందడానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి.