Old Vs New Tax Regime.. ఎన్ని సార్లు స్విచ్ అవ్వొచ్చు…

ఏప్రిల్ 1తో కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యింది. ఈ కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌ ప్రారంభంతోపాటుగా, కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త ఆదాయపు పన్ను మార్పులు కూడా అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఉద్యోగులకు ఇది శుభవార్త. ఎందుకంటే, కొత్త టాక్స్ రూల్స్ ప్రకారం మీరు రూ.12 లక్షల వరకు సంపాదిస్తే ఒక్క రూపాయైనా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదనంగా ఉద్యోగులకు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా లభిస్తుంది. అంటే మొత్తం కలిపితే రూ.12.75 లక్షల జీతం ఉన్నా టాక్స్ లేదు… అయితే ఈ బెనిఫిట్ కేవలం కొత్త టాక్స్ రీజైమ్‌ లోనే వర్తిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పాత టాక్స్ విధానం (Old Regime) ఇంకా ఉంది కానీ

కొత్త టాక్స్ విధానం ఇప్పుడు డిఫాల్ట్‌గా అమలవుతుంది. అంటే మీరు ప్రత్యేకంగా చెప్పకుండా ఉంటే, మీకు ఆటోమేటిక్‌గా కొత్త టాక్స్ విధానమే వర్తిస్తుంది. కానీ పాత టాక్స్ విధానం కూడా ఇంకా అందుబాటులో ఉంది. పాత టాక్స్ రీజైమ్‌లో 80C, 80D, హౌస్ లోన్ ఇంట్రెస్ట్ వంటి వివిధ డిడక్షన్లు లభిస్తాయి. అంటే మీరు LIC, PPF, ELSS వంటి స్కీముల్లో పెట్టుబడి పెడుతూ ఉంటే, పాత విధానమే మీకు ఎక్కువ లాభమివ్వవచ్చు. కానీ ఇక్కడే లాజిక్ ఉంది – మీరు ఏ విధానాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారో, ఆయా సమయంలో స్పష్టంగా ఎంపిక చేయాల్సి ఉంటుంది.

ఏటా ఎంచుకునే ఛాన్స్ ఎవరికైనా ఉందా?

వేతన జీవులకు మంచి న్యూస్ – మీరు ప్రతి సంవత్సరం ఒకసారి కొత్త లేదా పాత టాక్స్ విధానాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకి, ఈ సంవత్సరం కొత్త రెజీమ్ తీసుకుంటే, వచ్చే సంవత్సరం పాత రెజీమ్ తీసుకోవచ్చు. కాని, దీనికి Section 139(1) ప్రకారం ఐటీఆర్ ఫైలింగ్‌కు ముందు ఎంపిక చేయడం తప్పనిసరి. టైమ్ మిస్ అయితే, మీరు డిఫాల్ట్ ఆప్షన్‌లోనే కొనసాగాలి.

Related News

బిజినెస్ వర్గానికి మాత్రం కచ్చితమైన నియమాలు

మీ ఆదాయం వ్యాపారం లేదా ప్రొఫెషనల్ వర్క్ ద్వారా వస్తుంటే, మీరు ఒకసారి కొత్త రెజీమ్ వదిలేస్తే, పాత రెజీమ్‌కు తిరిగి మారే అవకాశం కేవలం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. అది కూడా టైమ్ లోపు స్పష్టంగా ఎంపిక చేసినపుడు మాత్రమే. అందుకే బిజినెస్ వర్గానికి ఇది చాలా కీలకమైన విషయం.

2025కి ఐటీఆర్ ఫైలింగ్ ఎప్పటికి?

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్‌కు చివరి తేది జూలై 31, 2025. ఈ తేదీ మిస్ అయితే, మీరు డిసెంబర్ 31, 2025 లోగా బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఎంచుకునే టాక్స్ విధానం మీదే మీ పన్ను మొత్తంలో పెద్ద తేడా వస్తుంది. ఒక చిన్న తప్పు వల్ల లక్షల్లో నష్టం అయ్యే అవకాశముంది.

కొత్త vs పాత టాక్స్ విధానం – తేడా ఏమిటి?

కొత్త టాక్స్ విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నా, బహుళ డిడక్షన్లు, మినహాయింపులు ఉండవు. ఇది సింపుల్ టాక్స్ విధానం. పాత విధానంలో అనేక సెక్షన్ల కింద మినహాయింపులు ఉంటాయి – 80C (LIC, PPF), 80D (మెడికల్ ఇన్షూరెన్స్), హౌస్ లోన్ ఇంట్రెస్ట్ మొదలైనవి. అంటే మీరు ఎక్కువగా సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ చేసే వ్యక్తి అయితే, పాత విధానం మీకు మేలు చేస్తుంది.

ఫైనల్‌గా చెప్పాలంటే

మీ ఆదాయం ఎలా ఉన్నా, ఏ స్కీములు తీసుకుంటున్నా, మీరు టైమ్ లోపు సరైన టాక్స్ విధానాన్ని ఎంచుకోవడం చాలా కీలకం. టైమ్ మిస్ అయితే డిఫాల్ట్‌గా కొత్త రెజీమ్‌లో పన్ను వేయబడుతుంది. ఒక్క తప్పు వల్ల మీరు పొందే మినహాయింపు మొత్తాన్ని కోల్పోతారు. కనుక, ముందే ఆలోచించండి – మీరు సేవ్ చేసే ప్రతి రూపాయి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.

ఇప్పుడే డిసైడ్ అవ్వండి – జూన్ వచ్చేదాకా వాయిదా వేసినోడికి జూలైలో టెన్షన్ గ్యారంటీ.