ఈ రోజుల్లో ఇంటి వద్ద కూర్చొని అన్నీ ఆర్డర్ చేసుకోవడం కామన్ అయిపోయింది. కానీ అదే డిజిటల్ సౌలభ్యం మనల్ని మోసాల పాలయ్యేలా చేస్తోంది. ఒక్క క్లిక్ తో వస్తున్న ఈ సౌకర్యం వెనక పెద్ద ప్రమాదం దాగి ఉంది. అందుకే, ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేసే ముందు రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ స్టూడెంట్ అవకాడో స్కామ్‌లో
తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు అవకాడోలు ఆర్డర్ చేయబోయి భారీ మోసానికి గురయ్యాడు. అవకాడోలు కొనాలనే ఉద్దేశంతో గూగుల్‌లో సెర్చ్ చేశాడు. ఆ సెర్చ్‌లో విజయవాడకు చెందిన “బాలాజీ ట్రేడర్స్” పేరుతో ఒక సంస్థ కనిపించింది. అక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు కాల్ చేసిన యువకుడికి అవకాడోలు ఇంటికే డెలివరీ చేస్తామని చెప్పారు.
వారు అడిగినంతగా కొంత అడ్వాన్స్ చెల్లించాడు. అంతటితో ఊరుకోకుండా, “వాహనం దారి మధ్యలో బ్రేక్‌డౌన్ అయింది” అని చెప్పి మరికొంత డబ్బు అడిగారు. స్టూడెంట్ నమ్మకంతో మళ్ళీ చెల్లించాడు. అంతేకాకుండా “ట్రాఫిక్ పోలీసులు వాహనం ఆపారు” అంటూ మళ్ళీ డబ్బు కోరారు. అలా ఒక్కొక్కసారి అడుగుతూ చివరకు మొత్తం రూ.2.60 లక్షలు లాక్కొన్నారు.
Related News
చివరికి తెలిసిన నిజం… అప్పటికే డబ్బు పోయింది!
కొన్ని గంటల తరువాత వ్యూహంలో ఏదో తేడా ఉందని ఆ యువకుడికి అనుమానం వచ్చింది. తేరుకున్నప్పటికీ అప్పటికే డబ్బంతా పోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.
సైబర్ మోసం జరిగిందంటే వెంటనే
పోలీసులు హెచ్చరిస్తూ చెబుతున్నారు. ఆన్‌లైన్ మోసం జరిగితే వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయాలని లేదా [cybercrime.gov.in](https://cybercrime.gov.in) వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. నేరం జరిగిన గంటలోపే ఫిర్యాదు చేస్తే నగదు ఫ్రీజ్ చేసే అవకాశముందని అంటున్నారు. లేటయితే మోసగాళ్లు డబ్బును వేరే ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసే ప్రమాదం ఉంది.
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే ముందు చక్కగా వెరిఫై చేసుకోండి. ఓ అవకాడో కోసం లక్షల రూపాయలు పోకుండా జాగ్రత్త పడండి!*