
ఉద్యోగులు సాధారణంగా EPF (ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్) పథకాన్ని మాత్రమే తెలుసుకుని అందులోనే పెట్టుబడి చేసి భవిష్యత్ భద్రత పొందాలని భావిస్తారు. ఇది నిజంగానే భద్రత కోసం మంచి మార్గం. అయితే ఈ EPF ప్లాన్‌కి పక్కన ఇంకో అద్భుతమైన అవకాశాన్ని చాలా మంది ఉద్యోగులు అస్సలు గమనించడం లేదు. అదే కార్పొరేట్ SIP.
SIP అంటే సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అయితే ఇది ఉద్యోగి తాను స్వయంగా బ్యాంక్ నుంచి పెట్టేది SIP కాదు. ఇది ఉద్యోగి జీతం నుంచే కంపెనీ ద్వారా ప్రతీ నెలా mutual fund లోకి వెళుతుంది. కంపెనీ ఉద్యోగుల భద్రత, వారికి దీర్ఘకాలిక సంపద కల్పించేందుకు ఇలా కొత్త విధానాన్ని తీసుకొస్తోంది.
కార్పొరేట్ SIP అనేది ఉద్యోగుల కొరకు కంపెనీ ద్వారా అమలయ్యే ఒక పెట్టుబడి పథకం. ఇందులో కంపెనీ ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థతో ఒప్పందం చేసుకుంటుంది. ఆ సంస్థలతో కలిసి కొన్ని ఎంపిక చేసిన స్కీంలను ఉద్యోగులకు అందిస్తుంది. ఆ తర్వాత ఉద్యోగి తాను ఇష్టపడే స్కీమ్ ఎంపిక చేసుకుని, ఎంత మొత్తం నెలకు deduct చేయాలనుకుంటున్నాడో నిర్ణయిస్తాడు.
[news_related_post]తర్వాత నెలనెలా ఆ ఉద్యోగి జీతం నుంచి ఆ నిర్ణయించిన మొత్తాన్ని కంపెనీ మ్యూచువల్ ఫండ్ సంస్థకు పంపిస్తుంది. ఇది ఉద్యోగి పేరు మీది ఖాతాలో ఇన్వెస్ట్ అవుతుంది. కంపెనీ కేవలం మధ్యవర్తిగా మాత్రమే ఉంటుంది. ఈ పెట్టుబడులపై కంపెనీకి ఎలాంటి హక్కు ఉండదు.
ఈ విధానం చాలా సరళమైనదీ, డిసిప్లిన్ పెట్టేలా ఉండటంతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. నెలకు ఒక నిర్ణీత మొత్తం జీతం నుంచే మినహాయించబడటంతో ఉద్యోగికి స్వయంగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆలస్యం కూడా జరగదు. ఇలా నెలనెలా పెట్టుబడి చేయడం వల్ల ఉద్యోగుల్లో పొదుపు అలవాటు ఏర్పడుతుంది. ఇది చాలామంది ఉద్యోగులు తొందరగా ఆర్థికంగా స్వతంత్రత పొందేందుకు దోహదపడుతుంది.
ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన వెంటనే ఈ SIPను ప్రారంభిస్తే, కంపౌండింగ్ వల్ల ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఇది పిల్లల చదువు, రిటైర్మెంట్ ప్లానింగ్, ఇంటి కొనుగోలు లాంటి పెద్ద లక్ష్యాలను చేరుకునే మార్గంగా మారుతుంది.
ఉద్యోగులు తమ జీతం నుంచి నెలకు ₹1,000 నుండి ₹5,000 వరకు కార్పొరేట్ SIPలో పెట్టుబడి చేయవచ్చు. ఇది మీరు ఎన్ని ఏళ్ళపాటు కొనసాగించాలనుకుంటున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు నెలకు ₹5,000 SIPగా పెట్టుబడి చేస్తే, 20 సంవత్సరాల తర్వాత మీ దగ్గర ₹50లక్షల వరకు corpus పెరుగుతుంది. మీరు ఎక్కువ సంవత్సరాలు పెట్టుబడి చేస్తే, ఒక లక్షరూపాయల పెట్టుబడితో మీరు ₹1 కోటి మార్క్‌ను కూడా అందుకోవచ్చు.
ఈ విధానంతో AMCs (Asset Management Companies) కు కూడా చాలా లాభాలు ఉంటాయి. ఉదాహరణకు నెలనెలా స్థిరంగా ఫండ్స్ రావడం వల్ల ఆ సంస్థలకి ఒక స్థిరమైన ఆదాయ ప్రవాహం ఉంటుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఒకే కంపెనీ నుంచి వచ్చే అవకాశం ఉండడంతో వారికీ పెద్దగా మార్కెటింగ్ ఖర్చు లేకుండా ఉంటుంది. ఇదే సమయంలో ఉద్యోగులు ఎక్కువకాలం మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు కట్టుబడి ఉంటారు.
కార్పొరేట్ SIP ఇప్పుడిప్పుడే కంపెనీల్లో అందుబాటులోకి వస్తోంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే దీన్ని ఉద్యోగుల ప్రయోజనం కోసం ప్రారంభించాయి. మీరు ఒక ఉద్యోగిగా ఉంటే మీ కంపెనీలో ఈ అవకాశం ఉందా లేదా అని HR విభాగం ద్వారా తెలుసుకోండి. కంపెనీ ఈ సదుపాయాన్ని కల్పిస్తే వెంటనే ప్రారంభించండి. చాలా తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక సంపదను సృష్టించుకోవచ్చు.
ఈ SIPలో నెలకు ₹1,000 పెట్టినా సరే 15–20 సంవత్సరాల తర్వాత మీరు మంచి మొత్తాన్ని సంపాదించవచ్చు. EPF మీ భద్రత కోసం అయితే, కార్పొరేట్ SIP మీ సంపద కోసం. రెండు కలిపితే మీరు నిజమైన ఆర్థిక స్వతంత్రతను పొందగలుగుతారు.
Disclaimer: ఈ సమాచారం ఫైనాన్షియల్ అవగాహన కల్పించేందుకు మాత్రమే. పెట్టుబడీ చేయడం ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.