ఈ కాలంలో స్టైలిష్ లుక్స్, అధునాతన ఫీచర్లు, మైలేజ్ కలిగిన కార్ కోసం యూత్ వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారి కోసం Maruti కంపెనీ తీసుకొచ్చిన కొత్త కార్ – Maruti Invicto 2025.
ఇది హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తోంది. అంటే, పెట్రోల్ ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ మోటర్ కలిపి వాడుతారు. ఇది మైలేజ్ పెరగడానికే కాకుండా పెర్ఫార్మెన్స్ కూడా అదిరేలా ఉంటుంది.
ఇంటీరియర్ డిజైన్ ఆకట్టుకుంటుంది
ఇంతకముందు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఈ కార్ ఇంటీరియర్ చాలా స్పేశియస్‌గా ఉంటుంది. బ్లాక్ డ్యాష్‌బోర్డ్, పెనారమిక్ సన్‌రూఫ్, ప్రీమియం స్పీకర్లు, వెంటిలేటెడ్ సీట్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 వేల్లో అడ్జస్ట్ చేయగలిగే డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటివల్ల ఇంటీరియర్ ఒక లగ్జరీ SUV లాగా ఫీల్ ఇస్తుంది.
ఇంజిన్, మైలేజ్ మీద అసలు రాజీ లేదు
ఈ కార్‌లో 2.0 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 150 PS పవర్, 188 Nm టార్క్ ఇస్తుంది. 7 లేదా 8 మంది కూర్చునే సామర్థ్యంతో వచ్చినా కూడా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇది ఆటోమాటిక్, మాన్యువల్ రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఒక్క లీటర్ పెట్రోలుతో 23.24 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
పెర్ఫార్మెన్స్ అద్భుతం
ఈ కార్ 0 నుంచి 100 కి.మీ వేగాన్ని కేవలం 9.5 సెకన్లలో చేరుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లో కూడా నడుస్తుంది. అంటే, ట్రాఫిక్‌లో పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు. మల్టిపుల్ వెరీయంట్స్‌లో లభించే ఈ కార్ మీ బడ్జెట్‌కు సరిపోయేలా ఉంటుంది.
ధరలు తెలుసుకోండి – వాల్యూ ఫర్ మనీ కార్
ఈ Maruti Invicto బేసిక్ వెరీయంట్ ధర రూ.25.51 లక్షల నుండి మొదలై, టాప్ వెరీయంట్ ధర రూ.29.22 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూం ధరలు). ఆన్ రోడ్ బేస్ వెరీయంట్ ధర సుమారుగా రూ.29.13 లక్షలు. ఇవి ఒక మిడిల్ క్లాస్ కుటుంబం కొరకు, లాంగ్ టైమ్‌లో మైలేజ్‌తో కూడిన బెస్ట్ కార్ అవుతుంది.
ఇక ఆలస్యం చేయకండి – పెట్రోల్ బిల్లు తగ్గించుకోవాలంటే Invicto హైబ్రిడ్ బెస్ట్ ఆప్షన్!