
వివో నుంచి తాజాగా రిలీజ్ అయిన Vivo X Fold 5 ఫోన్ టెక్నాలజీ ప్రపంచంలో సెన్సేషన్ అయిపోయింది. ఇది ఒక్క ఫోన్ మాత్రమే కాదు, ఓ లైఫ్‌స్టైల్ స్టేట్మెంట్. మడతపెట్టే ఫోన్ల ట్రెండ్‌కి ఊపునిచ్చేలా, శాంసంగ్ లేటెస్ట్ మోడల్స్‌తో గట్టిగా పోటీ ఇవ్వడానికి Vivo ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.
ఈ ఫోన్ ఓపెన్ చేస్తే కేవలం 4.3mm మందం మాత్రమే ఉంటుంది. అంటే మీరు ఒక పుస్తకాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది. మడతపెట్టినప్పుడు కూడా దీని తూగు కేవలం 217 గ్రాములే. డిజైన్ చూసినవాళ్లకు వెంటనే ఫోన్ మీద మనస్సు పడిపోతుంది. అంత స్లిక్‌గా, ప్రీమియంగా ఉంటుంది.
ఇందులో 16GB RAM, 512GB స్టోరేజ్ ఉంది. అంటే భారీగా యాప్‌లు, వీడియోలు, ఫొటోలు వేసుకున్నా ఫోన్ హ్యాంగ్ అవ్వదు. అలాగే, ఇది లేటెస్ట్ Android 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15తో రన్ అవుతుంది. ఇక ఫోన్ స్క్రీన్ గురించి చెప్పాలంటే 8.03 అంగుళాల మెయిన్ డిస్ప్లే, 6.53 అంగుళాల కవర్ డిస్ప్లే – రెండూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ స్మూత్‌గా ఉంటాయి.
[news_related_post]కెమెరా లవర్స్‌కి ఇది బెస్ట్ ఫోన్. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు, అద్భుతమైన 100x హైపర్ జూమ్ ఉన్న టెలిఫోటో లెన్స్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌కి ముందు, లోపలి స్క్రీన్లలో 20MP కెమెరా ఉంది. ఫొటోలు బాగానే కాదు.. DSLR లెవెల్ క్వాలిటీ వస్తుంది. బ్యాటరీ కూడా అదిరిపోయింది. 6,000mAh కెపాసిటీతో 80W ఫ్లాష్ ఛార్జింగ్, 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మిగిలిన ఫీచర్లలో డ్యూయల్ నానో సిమ్, WiFi 5, Bluetooth 5.4, డస్ట్-వాటర్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్ ధర రూ. 1,49,999. కానీ HDFC, SBI, Axis బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.15,000 డిస్కౌంట్ వస్తుంది. అదనంగా ₹15,000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా. జూలై 30 వరకు ప్రీ బుకింగ్ ఓపెన్ ఉంటుంది. అంతే కాదు.. రూ.1,499కి TWS 3e ఇయర్‌బడ్స్, 1 ఏటా ఎక్స్టెండెడ్ వారంటీ లభిస్తుంది. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్ కొనాలని అనుకుంటున్నవాళ్లు.. ఇంకెందుకు ఆలస్యం? మస్తు ఆఫర్లు ఉన్నాయి.. స్టాక్ అయిపోయేలోపే ఫోన్ బుక్ చేసేయండి!