రూ.15,000 SIP పెట్టుబడి చేసి కేవలం 5 ఏళ్లలోనే ఆగిపోయినా భవిష్యత్తులో అది రూ.2.26 కోట్లు అవుతుందంటే నమ్ముతారా? ఇది అసాధ్యమైన విషయం కాదు. ఇన్వెస్ట్ చేయడం ఒకసారి ప్రారంభిస్తే, మీరు దానిని నిలిపివేశాక కూడా ఆ డబ్బు పెరుగుతూనే ఉంటుంది. దీని వెనుక ఉన్న మంత్రం “కంపౌండింగ్” అనే శక్తి.
ఇన్వెస్ట్ చేయడం ఆలస్యం చేస్తే నష్టమే
చాలామంది ఎక్కువ ఆదాయం వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచిస్తారు. కానీ ఇన్వెస్ట్‌మెంట్‌లో నిబంధన సింపుల్ – ఎంత తొందరగా మొదలుపెడతారో, అంత మంచిది. చిన్న మొత్తం అయినా మొదలు పెడితే, తర్వాత ఆదాయం పెరిగినప్పుడు దాన్ని పెంచుకోవచ్చు.
ఇన్వెస్ట్‌మెంట్ ఆపిన తర్వాత కూడా డబ్బు పెరుగుతుందా?
ఒక వ్యక్తి రూ.20,000 SIP పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల తర్వాత ఆపేసాడనుకుందాం. కానీ ఆ డబ్బును వెనక్కి తీసుకోకుండా 25 ఏళ్ల పాటు అలాగే ఉంచాడు. 5 ఏళ్లలో అతను రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఈ 5 ఏళ్లలో అతనికి రూ.4.22 లక్షల లాభం వచ్చింది. టోటల్ కార్పస్ ₹16.22 లక్షలు.
Related News
ఇప్పుడు అదే డబ్బును మరో 25 ఏళ్ల పాటు అలాగే ఉంచితే,కేవలం క్యాపిటల్ గేన్స్‌నే రూ.2.59 కోట్లు వస్తాయి. మొత్తం కార్పస్ రూ.2.75 కోట్లు అవుతుంది. అంటే ఇన్వెస్ట్ చేయడం మానేశాక కూడా డబ్బు పెరుగుతూ ఉంటుంది. అంటే, ఆలస్యం లేకుండా ఎప్పుడైనా మొదలు పెట్టడమే మంచి నిర్ణయం.
రూ.15,000 SIP తో 5 ఏళ్లలో ఎంత పెరుగుతుంది?
రూ.15,000 SIP పెట్టుబడిని ప్రతి సంవత్సరం 5% పెంచుకుంటూ వెళితే, 5 ఏళ్లలో మొత్తం పెట్టుబడి ₹9.94 లక్షలు. క్యాపిటల్ గైన్ ₹3.35 లక్షలు. మొత్తం కార్పస్ ₹13.29 లక్షలు
25 ఏళ్లలో ఈ డబ్బు ఎంత అవుతుంది?
ఈ ₹13.29 లక్షలు మరో 25 ఏళ్ల పాటు అలాగే ఉంటే, క్యాపిటల్ గైన్ ₹2.12 కోట్లు. మొత్తం కార్పస్ ₹2.26 కోట్లు. అంటే, కేవలం 5 ఏళ్ల SIP తోనే మీ రిటైర్మెంట్ కోసం 2.26 కోట్ల కార్పస్ తయారవుతుంది. అయితే ఇది కంపెనీల పెర్ఫార్మెన్స్, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, సరిగ్గా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్లాలి.
(గమనిక: ఇది ఫైనాన్షియల్ అడ్వైజ్ కాదు. ఇన్వెస్ట్ చేసే ముందు ఎక్స్‌పర్ట్‌ను సంప్రదించండి.)