Kalki .. media and social medi లో ఎక్కడ చూసినా ఈ పేరు కనిపిస్తుంది.. వినిపిస్తోంది. సినిమా విడుదలకు ముందు ఉన్న క్రేజ్ విడుదల తర్వాత మరింత పెరిగింది. పిల్లలతో సహా అందరూ సినిమా తప్పక చూడాల్సిందే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం June 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాగా.. ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కల్కి నిలిచింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ వారాంతంలో 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.
కాకపోతే కల్కి సినిమా కొద్దిరోజుల్లోనే ఇంత వసూళ్లు రాబట్టడానికి ప్రధాన కారణం పెరిగిన ticket prices లే అని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కల్కి ticket prices పెంచి అదనపు షోలు వేసేందుకు అనుమతులు ఇచ్చాయి. కల్కి టికెట్ ధర భారీగా పెరిగింది. మల్టీప్లెక్స్‌లో ఒక వ్యక్తి కల్కిని చూడాలంటే కనీసం 500 రూపాయల టిక్కెట్టు చెల్లించాలి. సింగిల్ స్క్రీన్‌లో కూడా టిక్కెట్ ధర భారీగా ఉంటుంది.
దీనిపై సామాన్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. ticket prices ఇంతగా పెరిగితే కుటుంబమంతా వేల రూపాయలు వెచ్చించి సినిమా చూడాల్సిందే. ఈ నిర్ణయంపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కల్కి టికెట్ ధరలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కల్కి సినిమా టికెట్ ధరను తగ్గించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ధరలను తగ్గించి ముందుగా సాధారణ రేటుకే టికెట్ విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది. అంటే multiplexes లలో టికెట్ ధర రూ.235, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150. లేని పక్షంలో ఈ వారం తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.
కల్కి సినిమా కలెక్షన్లు పెరగాలంటే అది ఫ్యామిలీ ఆడియన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలంటేనే భయపడుతున్నారు. దీంతో ఈ విషయాన్ని గ్రహించిన దర్శకనిర్మాతలు త్వరలోనే సినిమా టిక్కెట్ ధరలను తగ్గించే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. tickets price తగ్గిస్తే మళ్లీ సినిమా చూసే అవకాశం ఉందని చాలా మంది అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.