ఇప్పుడు మన దేశంలో డెయిరీ పరిశ్రమ వేగంగా పెరుగుతోంది. రోజుకి లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతూ, వినియోగం పెరుగుతోంది. అయితే అందరూ గేదెలు, ఆవులు పెంచలేరు కదా… కానీ పశువులు లేకపోయినా డెయిరీ రంగంలో విజయవంతంగా బిజినెస్ చేయొచ్చని మీరు తెలుసా? అందులోనే మంచి ఆదాయం వచ్చేది “మిల్క్ కలెక్షన్ సెంటర్” ద్వారా.
మిల్క్ కలెక్షన్ సెంటర్ అంటే ఏంటి?
అన్నిపల్లెల్లో చిన్నచిన్న రైతులు పాలు ఉత్పత్తి చేస్తారు. కానీ వాళ్లకు మార్కెట్‌లో అమ్మడం కష్టమవుతుంది. అలాంటి పరిస్థితిలో, మీరు ఓ మిల్క్ కలెక్షన్ సెంటర్ ప్రారంభిస్తే, రైతుల దగ్గర పాలు సేకరించి పెద్ద డెయిరీ కంపెనీలకి సరఫరా చేయవచ్చు. ఇప్పటికే దేశంలో చాలా పెద్ద డెయిరీలు ఇలాంటి సెంటర్ల మీద ఆధారపడుతున్నాయి. మీ దగ్గర ఎక్కువ పెట్టుబడి లేకపోయినా, ఇది మీకు మంచి అవకాశమవుతుంది.
ఎలా ప్రారంభించాలి?
ముందుగా మీ ప్రాంతంలో ఉన్న పెద్ద డెయిరీ కంపెనీతో ఒప్పందం చేయాలి. ఆ ఒప్పందం ద్వారా మీరు రైతుల నుంచి పాలు కొనుగోలు చేసి కంపెనీకి ఇవ్వవచ్చు. మీ డెయిరీకి పెద్ద బ్రాండ్ తో లింక్ అయితే, వ్యాపారం వేగంగా పెరుగుతుంది.
Related News
ఏం అవసరం?
ఈ వ్యాపారానికి చిన్న స్థాయిలో పెట్టుబడి సరిపోతుంది. సుమారు ₹1 లక్షతో మీరు మొదలుపెట్టవచ్చు. మీకు అవసరమయ్యే సామగ్రి — మిల్క్ టెస్టింగ్ మెషీన్, స్టీల్ డబ్బాలు, స్టోరేజ్ ట్యాంక్‌లు వంటి వస్తువులు కొనాలి. ఇవన్నీ పాల నాణ్యతను బాగుంచడానికే అవసరం.
ప్రభుత్వ సహాయం, బ్యాంకు రుణాలు కూడా లభ్యం
కొన్ని డెయిరీ కంపెనీలు తమ ఆథరైజ్డ్ కలెక్షన్ సెంటర్లకి ఆర్థిక సహాయం కూడా ఇస్తుంటాయి. అలాగే ప్రభుత్వ పథకాల ద్వారా, లేదా బ్యాంక్ రుణం ద్వారా మొదలు పెట్టవచ్చు. సరైన ప్రణాళికతో మీరు నెలకి కనీసం ₹40,000–₹50,000 వరకు లాభం పొందవచ్చు.
ఇది ఎందుకు లాభదాయకం?
ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. ఎప్పటికప్పుడు పాలకి డిమాండ్ ఉంటుంది కాబట్టి రిస్క్ తక్కువ. పైగా పెద్ద కంపెనీలతో ఒప్పందం అయితే, వ్యాపారం స్థిరంగా నడుస్తుంది. సరిగ్గా ప్లాన్ చేస్తే, ఈ బిజినెస్‌ను పెద్ద స్థాయికి తీసుకెళ్లొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం? పశువులు లేకపోయినా పాల వ్యాపారంలో కోటీశ్వరులు గా మారే అవకాశం మీకూ ఉంది.