Cooling plants : ఎండాకాలంలో ఈ మొక్కలు పెంచితే చాలు.. ఏసీ అవసరం లేదు..!!

మార్చి నెల వేడి ఇప్పటికే తీవ్రంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతల్లో మార్పులతో చాలా మంది బాధపడుతున్నారు. బయటకు వెళ్లేవారు, ఇంట్లో ఉండేవారు కూడా వడదెబ్బకు గురవుతున్నారు. దీని కారణంగా చాలా మంది ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఇవి మాత్రమే కాకుండా చాలా మొక్కలు వేసవి వేడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇంటి ఆవరణలో వీటిని పెంచడం వల్ల చల్లదనం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఆ చల్లదనం కలిగించే మొక్కలు ఏమిటి? అవి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఫికస్ మొక్క
మొక్కలు, చెట్లు సహజంగా చల్లదనాన్ని అందిస్తాయి. అయితే, మీరు వాటిని ఇంటి ఆవరణలో పెంచగలిగితే కొన్ని ప్రత్యేక మొక్కలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవి మనకు వడదెబ్బ నుండి ఉపశమనం కలిగించి చల్లదనాన్ని అందిస్తాయి. వాతావరణాన్ని చల్లగా చేయడంలో అవి అద్భుతాలు చేస్తాయి. అలాంటి మొక్కలలో ఫికస్ మొక్క ఒకటి. ఇంటి ఆవరణలో మట్టి కుండలలో వీటిని పెంచడం వల్ల వేడి గాలి శుద్ధి అవుతుంది. చల్లదనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

బేబీ రబ్బరు మొక్కలు
చిన్నగా కనిపించే బేబీ రబ్బరు మొక్కలు ఇంట్లో పెంచడానికి అనువైనవి. అంతేకాకుండా.. ఈ మొక్కలకు ప్రతిరోజూ నీరు పోయాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల వాతావరణాన్ని చల్లబరుస్తాయి. ఇంటి ఆవరణలో వాటిని పెంచడం ద్వారా పరిసరాలు, ఇంటి వాతావరణం ఇతర ప్రదేశాలతో పోలిస్తే చల్లగా మారుతుంది.

Related News

ఫెర్న్ ప్లాంట్
ఫెర్న్ మొక్క చల్లదనాన్ని అందించడానికి ప్రసిద్ధి చెందింది. ఇళ్లలో పెంచితే అది వేసవి వేడి నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇది గాలి నుండి తేమను గ్రహించి దానిని తనలోనే నిల్వ చేసుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి ఇది ఆ తేమను విడుదల చేస్తుంది. దీనికి పువ్వులు లేదా పండ్లు ఉండవు. ఆకులు మాత్రమే ఉండే ఈ మొక్క చల్లదనాన్ని అందించడంలో అద్భుతాలు చేస్తుంది. కలబంద మొక్క చల్లదనాన్ని కూడా అందిస్తుందని నిపుణులు అంటున్నారు.