పోస్టల్ శాఖలో ఉద్యోగాలు. పది పాస్ అయితే చాలు.. పరీక్ష లేకుండానే అపాయింట్ మెంట్

Post Office GDS Recruitment: నిరుద్యోగులకు భారీ శుభవార్త. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికి గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేయబడింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఇండియన్ పోస్ట్ సిద్ధమవుతోంది. గతేడాది January లో దాదాపు 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా వేలాది పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.

రాత పరీక్ష లేకుండానే 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్థుల వయస్సు 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు Branch Post Master (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ ర్యాంకుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

Related News

ఈ పోస్టులకు ఎంపికైన వారు రోజుకు నాలుగు గంటల పాటు పని చేయాలి. పోస్టును బట్టి రూ.10-12 వేలు ప్రారంభ వేతనం పొందవచ్చు. ఇవి కాకుండా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్‌కు సంబంధించిన సేవలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను incentives ల రూపంలో అందజేయనున్నారు.