మీ సేవా కేంద్రాలు అందుబాటులోకి రావడంతో పౌర సేవలు మరింత సులభతరం అయ్యాయి. మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లను ఆన్లైన్లో సులభంగా పొందుతున్నారు. మా సేవా కేంద్రాలు లేకపోవడంతో వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. మీ సేవా కేంద్రాలు ప్రజలకు సేవలు అందించడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి మార్గాలుగా మారుతున్నాయి. మీరు కూడా మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికి శుభవార్త. తెలంగాణలోని అజిల్లాలో మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైంది.
నారాయణపేట జిల్లా ఈ-గవర్నెన్స్ సొసైటీ నారాయణపేట జిల్లాలో కొత్త సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. జిల్లాలోని 20 గ్రామాల్లో కొత్త సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. క్యాతంపల్లి, కిస్తాపూర్, గోటూరు, గుండమాల్, కొత్తపల్లి, మద్దూరు, మక్తల్, చిట్యాల్, కన్మనూర్, కోటకొండ, నారాయణపేట్ తదితర గ్రామాల్లో మీసేవా కేంద్రం ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రభుత్వ ఉద్యోగులు మరియు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. మీసేవ ఏర్పాటుకు అభ్యర్థులు ఆ గ్రామ పంచాయతీకి చెందిన వారై ఉండాలి. అభ్యర్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థికి మీసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన ఆర్థిక సామర్థ్యం ఉండాలి. పూర్తి వివరాల కోసం నారాయణపేట జిల్లా అధికారిక వెబ్సైట్ https://narayanpet.telangana.gov.in/
ముఖ్యమైన సమాచారం:
కొత్త మీసేవా సెంటర్ ఖాళీలు: 20
అర్హత: డిగ్రీ లేదా తత్సమాన అర్హత.
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.500 ”జిల్లా ఇ-గవర్నెన్స్ సొసైటీ నారాయణపేట జిల్లా” వారి పేరు మీద డీడీ తీసుకుని దరఖాస్తు ఫారానికి జత చేయాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. నారాయణపేట కలెక్టరేట్ కార్యాలయంలో పనివేళల్లో స్వయంగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.
ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష, విద్యార్హత మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-02-2024.
పరీక్ష తేదీ: 25-02-2024.
నారాయణపేట జిల్లా అధికారిక వెబ్‌సైట్: https://narayanpet.telangana.gov.in/