ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) శుభవార్త చెప్పింది. మార్చి 1వ తేదీ శనివారం యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది. నిపుణ & సేవా ఇంటర్నేషనల్ సహకారంతో JNTU ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది.
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త చెప్పింది. మార్చి 1వ తేదీ శనివారం యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది. నిపుణ & సేవా ఇంటర్నేషనల్ సహకారంతో JNTU ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది.
10వ తరగతి నుండి గ్రాడ్యుయేట్ల వరకు అన్ని రంగాలలోని ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలను ఒకే చోటకు తీసుకువస్తారు. JNTUలో జరగనున్న మెగా జాబ్ మేళా-2025లో వందకు పైగా కంపెనీలు పాల్గొంటాయి. 20 వేలకు పైగా ఉద్యోగ ఆఫర్లతో కంపెనీలు నియామకాలు చేపడతాయని నిర్వాహకులు తెలిపారు.
JNTU మెగా జాబ్ ఫెయిర్‌లో 20 కి పైగా ఐటీ కంపెనీలు, 10 కి పైగా ఫార్మా కంపెనీలు, 30 కోర్ కంపెనీలు, 40 కి పైగా బ్యాంక్, రిటైల్, FMCG మరియు మేనేజ్‌మెంట్ కంపెనీలు పాల్గొంటున్నాయి. 10వ తరగతి నుండి గ్రాడ్యుయేట్ల వరకు నిరుద్యోగులు ఈ మెగా జాబ్ ఫెయిర్‌ను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
మార్చి 1న కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని JNTU క్యాంపస్‌లో ఉదయం 10 గంటల నుండి జాబ్ ఫెయిర్ ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఫోటోలో ఉన్న QR కోడ్ ద్వారా ఉద్యోగార్థులు ఉచితంగా నమోదు చేసుకోవాలని JNTU VC తెలిపారు.