యూజర్లకు షాక్ ఇచ్చిన జియో!.. ఏంటంటే?

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను తొలగించింది. వాయిస్, SMS కోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురావాలని టెలికాం కంపెనీలకు TRAI కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, జియో కొత్త ప్లాన్లను తీసుకువచ్చింది. అదే సమయంలో, పాత ప్లాన్లను తొలగించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇప్పటివరకు అందిస్తున్న రూ. 189, రూ. 479 రీఛార్జ్ ప్లాన్లను తన వెబ్‌సైట్ నుండి తొలగించింది. తక్కువ డేటా, ఎక్కువ వాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్‌లను కోరుకునే వినియోగదారులకు జియో గతంలో ఈ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. రూ. 189 ప్లాన్ 28 రోజుల వాలిడిటీని కలిగి ఉండగా.. రూ. 479 ప్లాన్ 84 రోజుల వాలిడిటీని కలిగి ఉంది.

అయితే, ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా.. జియో ఇటీవల రెండు వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రూ. 458 ప్లాన్‌తో పాటు, 365 రోజుల వాలిడిటీతో రూ. 1958 ప్లాన్‌ను ప్రవేశపెట్టారు. వీటికి జియో టీవీ, మూవీ, క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ సౌకర్యాలను జోడించింది.

Related News