AP Govt: ‘ఇక నుంచి ఆ పేరు కనపడదు’.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు సంకీర్ణ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల పేర్లను తొలగించారు.

వివరాలలోకి వెళితే, ‘నవరత్నాలు- అందరికీ ఇళ్ళు’ కార్యక్రమంలో భాగంగా ఏపీలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల పేర్లను మార్చాలని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ఈ కాలనీలకు ‘పీఎంఏవై-ఎన్టీఆర్’ నగర్ అని పేరు పెట్టనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కలిపి ఆ కాలనీలలో పక్కా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *